నేచురల్ స్టార్ నాని తన ఫ్యాన్స్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన భారీ ఫ్యాన్స్ మీట్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న నాని అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు 10 వేల మంది ఫ్యాన్స్ హాజరైన ఈ ఈవెంట్‌లో నాని వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. అభిమానులను కలుసుకోవడంతో పాటు వారితో ఫొటోలు దిగుతూ ఉత్సాహపరిచారు.
వంటకాలతో భోజనం..
అంతేకాదు.. కార్యక్రమానికి వచ్చిన అభిమానుల కోసం నాని ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వెజ్, నాన్-వెజ్ వంటకాలతో వారికి ఘనంగా భోజనం పెట్టించారని సమాచారం. కాగా ‘ది ప్యారడైజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఈ ఫ్యాన్స్ మీట్‌కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఫ్యాన్స్ కోసం నాని తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్యారడైజ్ స్టోరీ రివీల్..
తాజాగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో నాని. ప్రమోషన్లలో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించగా..ఈ మూవీ కథ లైన్ ఏంటో చెప్పేశారు. ఈ మూవీని 1984–85 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు నాని వెల్లడించారు. అసలు ఉనికి లేని ఒక జాతి తమ ఉనికి కోసం చేసే తిరుగుబాటు కథాంశంతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. సవారీలు అనే తెగకు ఎలాంటి ఐడెంటిటీ ఉండదు.. వాళ్లు ఎవరినైనా చంపినా కేసు ఉండదు.. వాళ్లను చంపినా ఎవరూ పట్టించుకోరు.. ఆ జాతి తమ మనుగడ కోసం చేసిన యుద్ధమే ది ప్యారడైజ్ స్టోరీ అని నాని రివీల్ చేశారు.
Natural Star @NameisNani with fans ❤️#TheParadise pic.twitter.com/dNf8kNXO64
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) September 21, 2026


