బిగ్‌బాస్‌లో ముదిరిన గొడవలు.. కొడితే పళ్లు రాలుతాయ్‌ అంటూ.. | Bigg Boss Season 10 Telugu Day 15 Promo: Srishti Fires On Sudheer | Sakshi
Sakshi News home page

Bigg Boss Promo : కొడితే పళ్లు రాలుతాయ్.. సుధీర్‌పై సృష్టి ఫైర్‌

Sep 21 2026 12:51 PM | Updated on Sep 21 2026 1:07 PM

Bigg Boss Season 10 Telugu Day 15 Promo: Srishti Fires On Sudheer

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత రసవత్తరంగా సాగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు, విభేదాలతో హౌస్‌లో వాతావరణం వేడెక్కుతుండగా.. తాజాగా సుధీర్, సృష్టి మధ్య జరిగిన గొడవ హాట్‌టాపిక్‌గా మారినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతోంది.  ఈ వ్యవహారం నామినేషన్స్‌లో మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.

 ఆసక్తికరమైన పరిణామాలు
హౌస్‌లో త్రిగుణ్ చుట్టూ కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సుధీర్.. సృష్టితో లవ్ ట్రాక్‌ నడిపించే విషయంలో త్రిగుణ్ వద్ద సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి నుంచీ సృష్టి మాత్రం సుధీర్‌కు కాస్త దూరంగానే ఉంటూ వస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కంటే గొడవలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మూడో వారం నామినేషన్స్‌లో సుధీర్ వ్యవహరించిన తీరుపై సృష్టి తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. సుధీర్ పదేపదే మాట్లాడటంతో సహనం కోల్పోయిన ఆమె.. గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ‘గుద్దితే పళ్లు రాలుతాయ్’ అంటూ ఫైర్ అయింది. అంతేకాకుండా ‘నోరు మూసుకో’ అంటూ సుధీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

సృష్టి పెద్దగా కనిపించలేదని
కాగా రెండో వారంలో సృష్టి పెద్దగా కనిపించలేదని నాగార్జున కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఈ వారం మాత్రం నామినేషన్స్‌లో ఆమె గట్టిగానే స్పందించినట్లు కనిపిస్తోంది. తనపై వచ్చిన మాటలకు, సుధీర్ వ్యవహారశైలికి సృష్టి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అయితే గొడవ మరింత ముదరడంతో సృష్టి భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది.  వెక్కి వెక్కి ఏడ్చినట్లు కనిపించడంతో హౌస్‌లో పరిస్థితి ఒక్కసారిగా సీరియస్‌గా మారింది.  ఇప్పుడు సుధీర్–సృష్టి మధ్య జరిగిన ఈ నామినేషన్ గొడవ ఇప్పుడు బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.  అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణమేంటి? సుధీర్ ఎందుకు పదేపదే సృష్టిని టార్గెట్ చేశాడు? సృష్టి అంతలా ఎందుకు ఫైర్ అయింది? అనేది పూర్తి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.
  ఇదీ చదవండి: కదిలిస్తే.. కన్నీరే.. ఇదే కయాదు జర్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement