‘ఎనిమిది గంటలు నీటిలో ఉండడానికి.. నేను చేపనా..’ | Rashmika Mandanna Speech At Mysaa Teaser Launch Event | Sakshi
Sakshi News home page

Mysaa Teaser: ‘ఎనిమిది గంటలు నీటిలో ఉండడానికి.. నేను చేపనా..’

Sep 21 2026 11:43 AM | Updated on Sep 21 2026 12:13 PM

Rashmika Mandanna Speech At Mysaa Teaser Launch Event

రష్మిక మందన్న నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రాల్లో 'మైసా' ఒకటి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు.  పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.  అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2026 నవంబర్ 27న విడుదల కానుంది. ఇందులో ఈశ్వరి రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేష్, శివ కందుకూరి, కార్తిక్ రంజిని, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మరో రెండు వారాల షూటింగ్‌ ఉంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రష్మిక చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

సుమారు 8గంటలు కిందే ఉండమన్నారు..
‘మైసా’ కోసం నా లైఫ్‌నే ఇచ్చేశాను. కథ అద్భుతంగా అనిపించింది. డైరెక్టర్ నాతో చాలా రిస్కీ స్టంట్స్ చేయించారు.  అండర్‌ వాటర్‌లో ఫైట్‌ ఉంది అని డైరెక్టర్‌ చెప్పారు. నాకు ఈత వచ్చుకదా అని సరే చెప్పా. తీరా చూస్తే.. సుమారు 8గంటలు కిందే ఉండమన్నారు. అదేలా నేను ఏమైనా చేపనా అలా ఉండడానికి అనిపించింది. కథకు తగ్గట్లుగా నిజంగా చేయాలంటే ఎంత కష్టమో అప్పుడే తెలిసింది’ అని చెప్పారు. ఇదే క్రమంలో ఓ అభిమాని మీకు తెలంగాణ భాష వచ్చేసింది అక్కా అని చెప్పగా.. ‘నేను ఏ రకంగా మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదు. పోనిలే మాట్లాడింది మీకు అర్థం అవుతుంది కదా’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

రణబాలి విషయానికి వస్తే.. 
టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్‌ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్‌ 16 ఈ సినిమా విడుదల  కానుంది.  ఇప్పుడికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమి చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఇటీవలే ప్రత్యేక  పోస్టర్‌ను విడుదల చేశారు. 
ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. విజయ్‌ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్‌, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి అజయ్‌, అతుల్‌ సంగీతం అందిస్తున్నారు.  టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 
ఇదీ చదవండి: కదిలిస్తే.. కన్నీరే.. ఇదే హీరోయిన్‌ కయాదు జర్నీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement