ప్రస్తుతం కాలంలో విడాకులు పెరిగిపోవడంపై హీరోయిన్ కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసహనంతో కూడిన మనుషులు, మితిమీరిన సోషల్‌మీడియా వాడకం దీనికి ప్రధాన కారణమన్నారు. ‘ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఫొన్లకే పరిమితమవుతున్నారు. అర్థవంతమైన మాటాలు, సమయం కేటాయించుకోవడం తగ్గిపోవడం వల్లే రిలేషన్ షిప్‌లో దూరాలు పెరుతున్నాయన్నారు.
‘నేను, నా భర్త ఖాళీగా ఉండే సమయాన్ని చాలా గౌరవిస్తాం. ప్రతివారం ఎక్కడకైనా డిన్నిర్‌కి వెళ్తాం. సరదాగా ఎక్కువ టైం మాట్లాడుకుంటాం’ అని కాజల్ తెలిపారు. సోషల్ మీడియాతో టైంపాస్ చేయకుండా భాగస్వామితో సమయం కేటాయిస్తే బాండిగ్ స్ట్రాంగ్ అవుతుందని సూచించారు.
కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే...
చిత్రసీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కాజల్ 2020 అక్టోబర్ 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు. వీరికి నీల్ కిచ్లూ అనే కుమారుడు ఉన్నాడు. సినిమాల విషయానికి వస్తే ‘ది ఇండియా స్టోరీ’తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇదీ చదవండి: బతికుండగానే చంపేశారు.. నటి భావోద్వేగం..


