సాక్షి, చెన్నై: నటుడు అజిత్‌కుమార్ అభిమానులు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తమిళగ మక్కల్ కళగం (తమిళనాడు పీపుల్స్ పార్టీ) పేరుతో ఈ కొత్త రాజకీయ పార్టీని ఆదివారం ప్రకటించారు. అజిత్ అభిమానులు కల్లకురిచి జిల్లాలోని ఉలందూరుపేటలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆబిత్, రాష్ట్ర కార్యదర్శిగా రామ్‌కుమార్, కోశాధికారిగా మహమ్మద్ షా నియమితులయ్యారు. అజిత్ రాజకీయాల్లోకి వస్తే బాధ్యతలు స్వీకరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఖాళీగా ఉంచారు.


