‘రామాయణ’పై డైరెక్టర్‌ రాజమౌళి రివ్యూ | SS Rajamouli Review On Ramayana Movie | Sakshi
Sakshi News home page

Rajamouli Ramayana Review : ‘రామాయణ’పై స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి రివ్యూ

Nov 5 2026 5:11 PM | Updated on Nov 5 2026 5:24 PM

SS Rajamouli Review On Ramayana Movie

భారీ అంచనాల నడుమ ఎట్టకేలకు  ఈరోజు 'రామాయణ' సినిమా థియేటర్లలో విడుదలైంది. దానికి తగ్గట్లుగానే మంచి స్పందనే అందుకుంది. అయితే ఈ మూవీ చూసిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయలను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇలా ప్రముఖ దర్శకుడు రాజమౌళి పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. 

ప్రతి సన్నివేశం అద్భుతం
‘రామాయణం’ చిత్రంలోని అత్యున్నత హంగులు, వెండితెరపై ఆవిష్కరించిన విజువల్స్‌ చాలా బాగున్నాయి. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా వనవాస ఘట్టంలో అతడి అభినయం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూనే ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. రావణుడిగా యశ్‌ భయపెట్టారు. సీతగా సాయిపల్లవి హుందాగా కనిపించింది. సినిమాలోని పతాక సన్నివేశాలతో పాటు అంతకుముందు వచ్చే ఘట్టాలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి.

 ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆస్వాదించాను. ఇంతటి చిత్రాన్ని, భారీ విజన్‌ను తెరపై అందంగా ఆవిష్కరించిన నిర్మాత నమిత్‌ మల్హోత్రా, దర్శకుడు నితేశ్‌ తివారీతో పాటు చిత్రబృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు​’ అని ఎక్స్‌ వేదికగా తెలిపారు. కాగా ‘రామాయణ’ లో రావణుడిగా యశ్‌ కనిపించారు. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించారు. 

(ఇదీ చదవండి: ‘రామాయణం’ మూవీ రివ్యూ)

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement