క్రిష్టియన్‌ అబ్బాయితో ప్రేమ.. మా ఇంట్లో ఒప్పుకోలేదు: కీర్తి సురేశ్‌ | Keerthy Suresh On Convincing Family For Interfaith Marriage With Antony Thattil | Sakshi
Sakshi News home page

Keerthy Suresh Marriage: ‘మా పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదు’

Nov 5 2026 3:42 PM | Updated on Nov 5 2026 3:53 PM

Keerthy Suresh On Convincing Family For Interfaith Marriage With Antony Thattil

నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేశ్‌. అయితే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా వెల్లడించారు. వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో తన ప్రేమ, పెళ్లి కోసం కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ఎదురైన ఇబ్బందుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.  ఇవీ ప్రసుతం వైరల్‌ అవుతున్నాయి.

‘నా డైరీలో ప్రేమకు సంబంధించిన విషయాలన్నీ ఉండేవి. అమ్మ దాన్ని చదివేసింది. తల్లిగా నీ డైరీ చదివే హక్కు నాకు ఉందని చెప్పింది. ఆ రోజు తర్వాత డైరీ రాయడం పూర్తిగా మానేశాను. నాకు డైరీ రాయడం చాలా ఇష్టం. కానీ ఇప్పుడు అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. బహుశా అమ్మ దాన్ని తగలేసి ఉంటుందని అనుకుంటున్నాను. మళ్లీ ఆ డైరీ దొరికితే బాగుంటుంది’ అని కీర్తి తెలిపారు.

మతాంతర వివాహం.. ఇంట్లో పెద్ద సమస్యలు
కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ ప్రేమకథ 2010 జనవరి నుంచి మొదలైంది. అప్పటికి కీర్తి వయసు 17 ఏళ్లట. ఆంటోనీ ఆమె కంటే ఏడేళ్లు పెద్దవారట. అయితే వీరిద్దరి మతాలు వేర్వేరు కావడంతో పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులను ఒప్పించడం అంత సులభం కాలేదని కీర్తి తెలిపారు.

‘ఆంటోనీ క్రిస్టియన్ కావడంతో మా ఇంట్లో చాలా సమస్యలు ఎదురయ్యాయి. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి నాకు చాలా సమయం పట్టింది. నేను సినిమాల్లోకి రాకముందే ఆయన నాకు తెలుసు. ఇద్దరం కలిసి ఎదిగాం. ఒకరినొకరం అర్థం చేసుకున్నాం’ అని చెప్పారు.

15 ఏళ్ల ప్రేమ.. గోప్యంగా సాగిన ప్రయాణం
2024 నవంబర్‌లో దీపావళి సందర్భంగా ఆంటోనీతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుని.. తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో 2024 డిసెంబర్ 12న గోవాలో వివాహం చేసుకున్నారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఓటీటీలోనూ కీర్తి సందడి
ఇక సినిమాలతో పాటు ఓటీటీలోనూ కీర్తి సురేశ్‌ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘అక్క’ సిరీస్‌లో రాధికా ఆప్టేతో కలిసి నటించారు. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో కీర్తి నటనకు మంచి స్పందన లభిస్తోంది. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్‌తో డిజిటల్‌ ప్రేక్షకుల ముందూ తన నటనతో మెప్పిస్తున్నారు.

 (ఇదీ చదవండి: ఓటీటీలోకి జైలర్‌2.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఇదే.. అధికారిక ప్రకటన)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement