ఆ ముగ్గురు హీరోలు అంటే ఇష్టం.. ‘మహానటి’ నా ఫేవరెట్‌ : సుష్మితా శెట్టి | Sushmitha Shetty Talk About Donga Na Koduku Movie | Sakshi
Sakshi News home page

‘దొంగ నా కొడుకు’ చూసి నవ్వుకుంటూ బయటికి వస్తారు: సుష్మితా శెట్టి

Nov 5 2026 7:17 AM | Updated on Nov 5 2026 7:17 AM

Sushmitha Shetty Talk About Donga Na Koduku Movie

‘‘దొంగ నా కొడుకు’ సినిమా వినోదాత్మకంగా రూపొందింది. ఇందులో ఫ్రెష్‌ కామెడీ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్‌ చేసే ఫన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మా మూవీ చూసిన ప్రేక్షకులు థియేటర్‌ నుంచి నవ్వుకుంటూ బయటకి వస్తారు’’ అని హీరోయిన్‌ సుష్మితా శెట్టి తెలిపారు. ‘లిటిల్‌ హార్ట్స్‌’ మూవీ ఫేమ్‌ మౌళి తనూజ్‌ ప్రశాంత్‌ హీరోగా నటించిన చిత్రం ‘దొంగ నా కొడుకు’. శ్రీను కంబాల దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. 

(చదవండి: రామ్ చరణ్- సుకుమార్ మూవీ.. చెర్రీ రోల్ అదేనా?)

ఈ సందర్భంగా సుష్మితా శెట్టి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘జగమే సంగీతం’  అనే వెబ్‌ సిరీస్‌ చేశాను. లీడ్‌ హీరోయిన్‌గా ‘దొంగ నా కొడుకు’ నా మొదటి సినిమా. ఇందులో చాలా క్యూట్‌ అండ్‌ బబ్లీ క్యారెక్టర్‌ చేశాను. నా రోల్‌లో ఇన్నోసెంట్‌ కామెడీ ఉంటుంది. నేను ఏదైనా స్మార్ట్‌గా చేయాలనుకుంటే అది కామెడీగా మారుతుంది. 

బిగ్‌ స్క్రీన్‌పై నన్ను నేను చూసుకోవడానికి ఆత్రుతగా ఉన్నాను. నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. టాలీవుడ్‌లో డ్యాన్సింగ్‌ హీరోల్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌గార్లు అంటే ఇష్టం. ‘మహానటి’ సినిమా నా ఫేవరెట్‌. అలాంటి అన్ని భావోద్వేగాలున్న సినిమా చేయాలని ఉంది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement