రాధికా ఆప్టే కామెంట్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన టాలీవుడ్ నిర్మాత | Producer SKN Responds On Radhika Apte Comments about south cinema | Sakshi
Sakshi News home page

SKN: రాధికా ఆప్టే కామెంట్స్.. టాలీవుడ్ నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్

Nov 5 2026 4:15 AM | Updated on Nov 5 2026 5:08 AM

Producer SKN Responds On Radhika Apte Comments about south cinema

హీరోయిన్ రాధిక ఆప్టే కామెంట్స్‌పై టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ ఫైరయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎదిగిన హీరోయిన్స్ ఇదే పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. దక్షిణాది సినీరంగాన్ని తప్పుగా చూపించడంపై ఎస్‌కేఎన్ మండిపడ్డారు. ప్రతి నటికి, నటుడికి తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. కానీ తమకు లైఫ్ ఇచ్చిన పరిశ్రమనే చిన్నచూపు చూడటం ఏమాత్రం కరెక్ట్ కాదని ఎస్‌కేఎన్ స్పష్టం చేశారు

దక్షిణాది చలనచిత్ర రంగం తమ కథలలో ఇక్కడి ప్రాంతీయ సంప్రదాయాలను, సంస్కృతులను ఎంతో అపురూపంగా ప్రదర్శిస్తాయని ఎస్‌కేఎన్‌ వెల్లడించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే వారికి అవీ వింతగా అనిపించినప్పటికీ, ఇక్కడి ప్రేక్షకులకు ఆ సంస్కృతులు ఎంతో పరిచయమని ఆయన గుర్తుచేశారు. గౌరవం అనేది ఎప్పుడూ ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలని.. ఆఫర్స్ వచ్చినప్పుడు ఎంతో గొప్పగా భావించి ఇప్పుడు వాటిని కించపరిచేలా మాట్లాడటాన్ని అంగీకరించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంత సంస్కృతి మాత్రమే గొప్పదనేలా కొందరు ప్రవర్తించడాన్ని టాలీవుడ్ సహించదని హెచ్చరించారు. మిమ్మల్ని ఆదరించి, గౌరవించిన పరిశ్రమను గౌరవించడం నేర్చుకోవాలంటూ ఎస్‌కేఎన్ సూచించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement