మరో మెగా ప్రాజెక్ట్‌కు అంతా సిద్ధమైంది. రామ్ చరణ్- సుకుమార్ మరోసారి ప్రేక్షకుల అలరించేందుకు రానున్నారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ17 మూవీని గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో అఫీషియల్‌గా ప్రారంభించారు.. రంగస్థలం లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సుకుమార్‌తో జతకట్టారు మెగా హీరో. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ మూవీలో రామ్ చరణ్ రోల్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్‌తో ఒక్కసారిగా చెర్రీ రోల్‌పై చర్చ మొదలైంది. ఈ పోస్టర్‌ను డీకోడ్ చేసిన నెటిజన్స్ రామ్ చరణ్ శ్రీకృష్ణునిగా కనిపిస్తాడని ప్రచారం చేస్తున్నారు. అయితే మేకర్స్ తాజాగా విడుదల చేసిన ముహూర్తం స్పెషల్ వీడియో ప్రోమో చివరిలో ఒక్క సెకను లోపే వెళ్లిపోయే ఫ్రేమ్‌లో రామ్ చరణ్ లుక్ రివీల్ చేశారు. సీన్ కట్ చేస్తే తాను జుట్టు ముడి వేసి గోవింద నామంతో కనిపించడం ఊహించని అంశంగా మారింది. దీంతో రామ్ చరణ్ శ్రీకృష్ణునిగానే కనిపించడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యిపోయారు. చాలా కాలంగా రామ్ చరణ్ ఇలాంటి డివోషనల్ రోల్‌లో చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫైనల్‌గా అభిమానుల కోరిక ఈ మూవీతో తీరేలా కనిపిస్తోంది.


