నాగచైతన్య వృషకర్మ.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే? | Naga Chaitanya Latest Movie Vrushakarma first single date locked | Sakshi
Sakshi News home page

Vrushakarma Movie: నాగచైతన్య వృషకర్మ.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

Nov 5 2026 12:15 AM | Updated on Nov 5 2026 12:15 AM

Naga Chaitanya Latest Movie Vrushakarma first single date locked

తండేల్‌ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ తర్వాత నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో స్పర్ష్‌ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర–సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌  నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ రిలీజ్ డేట్‌ ఫిక్స్ చేశారు. ఈ నవంబర్ 7న స్వాగ్ ఆఫ్ అర్జున్ పేరుతో ఫస్ట్ లిరికల్ సాంగ్‌  విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement