దొంగ నా కొడుకు.. టైటిల్‌ మార్చేశారు..! | Donga Naa Koduku Movie Title changed by Sensor Board | Sakshi
Sakshi News home page

Donga Naa Koduku Movie: దొంగ నా కొడుకు.. టైటిల్‌ మార్చేశారు..!

Nov 4 2026 5:02 AM | Updated on Nov 4 2026 5:03 AM

Donga Naa Koduku Movie Title changed by Sensor Board

‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మౌళి.. ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో సుస్మిత శెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీను కంబాల డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, సాంగ్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్‌ 13న థియేటర్లలోకి రానుంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమా టైటిల్‌పై సెన్సార్‌ బోర్డ్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దొంగ నా కొడుకు టైటిల్‌ని కాస్తా డిఎన్‌కే (DNK) మార్చేశారు. ఇప్పటి నుంచి ఈ మూవీ టైటిల్ డీఎన్‌కేగా మారనుంది. కాగా.. ఈ చిత్రానికి శింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement