'దొంగ నా కొడుకు వచ్చేస్తున్నాడు'.. రిలీజ్ ఎప్పుడంటే?
లిటిల్ హార్ట్స్ మూవీతో మెప్పించిన యూట్యూబర్, నటుడు మౌళి నటిస్తోన్న చిత్రం దొంగ నా కొడుకు. ఈ మూవీతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో మౌళికి జోడీగా సుస్మితా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.ఈ మూవీని నవంబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు పోస్టర్లోనే అర్థమవుతోంది. ఈ చిత్రంలో మౌళికి తండ్రిగా టాలీవుడ్ కమెడియన్ అలీ నటిస్తున్నారు. ఈ మూవీకి సింజిత్ యర్రమిల్లి సంగీతం అందిస్తుండగా.. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.He’s back to steal your laughs, this time with his absolutely mad family 🤟❤️🔥 #DongaNaaKoduku looting the Box Office worldwide from NOVEMBER 13th 🔥 ROBBERY • CRIME • COMEDY #MouliRobsMythri #DNK Produced by @MythriOfficial Written & Directed by @DonGaNaakOduKu Starring @Mouli_Talks @susshhee_ Music by @SinjithYerramil DOP @suriyabalaji_97 Editor @sreedharlb Art Director: @nagendra84052 Costume Designer: @MahiDerangula Action Choreographer: @RajeshLanka1986 Audio on @thinkmusicindia Overseas by @prathyangiraus— Mythri Movie Makers (@MythriOfficial) October 6, 2026