‘B’ కేటగిరీ అవకాశాలైనా ఇవ్వండి: నటి రజిత | Actress Rajitha Questions Lack of Opportunities for Senior Women Artists in Telugu Cinema | Sakshi
Sakshi News home page

రెగ్యులర్‌ ముఖాలంటూ పక్కన పెడుతున్నారు: రజిత

Oct 21 2026 8:33 PM | Updated on Oct 21 2026 9:08 PM

Actress Rajitha Questions Lack of Opportunities for Senior Women Artists in Telugu Cinema

కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘దొంగ నా కొడుకు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు మౌళి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌ 13న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.  ఈ సినిమాలో ప్రముఖ నటి రజిత పాల్గొని మూవీ అవకాశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హీరోయిన్‌ పాత్రలు కావాలని కోరుకోవడం లేదు
సీనియర్‌ మగ నటులకు ప్రతి సినిమాలోనూ వరుసగా అవకాశాలు వస్తుంటే.. అదే వయసున్న నటీమణులను మాత్రం రెగ్యులర్‌గా కనిపించే ముఖాలంటూ పక్కన పెడుతున్నారని డైరెక్టర్లను ప్రశ్నించారు. 

‘హీరోయిన్‌ పాత్రలు కావాలని కోరుకోవడం లేదు. ‘A’ కేటగిరీలో ఉన్న నదియా, ఖుష్బూ వంటి సీనియర్‌ నటీమణులకు లభించే పాత్రలు కూడా అవసరం లేదు.  కనీసం ‘B’ కేటగిరీల కిందకైనా మేము వస్తాం కదా? ఆ అవకాశాలైనా కల్పించాలి. ఇది విజ్ఞప్తి మాత్రమే.‘ అని రజితా అన్నారు. అవకాశాలు కల్పించడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

(ఇదీ చదవండి: పెద్ద ఫ్యామిలీ నటుడైతే ఇలా అనేవారా?: మౌళి)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement