యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మౌళి.. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా మారి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మరో కామెడీ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మౌళి.. తనపై వస్తున్న ట్రోల్స్, విమర్శల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చాలా బాధపడ్డాను
తన ఎదుగుదలను కొందరు తట్టుకోలేకపోతున్నారని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మౌళి స్పందించారు. ‘చాలా బాధపడ్డాను. ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నటుడైతే ఇలాగే మాట్లాడేవారా? వీడు ఏం చేయగలడు? అన్నట్లుగా చాలా కామెంట్లు చేశారు. నిజానికి నేను ఏం చేయలేను. నాకు సినిమా అంటే ఇష్టం. అందుకే ఇవన్నీ భరిస్తున్నాను’ అని చెప్పారు.
‘లిటిల్ హార్ట్స్’ విజయం తర్వాత ఓ ఛానల్ కార్యక్రమానికి నన్ను పలిచారు. ఆ సమయంలో ఆరోగ్యం బాగోలేకపోవడంతో రాలేనని చెప్పా. అప్పుడు నీ తర్వాతి సినిమాకు నెగిటివ్ ప్రచారం జరిగే అవకాశం ఉందమో చూసుకో అని వాళ్లు హెచ్చరించారు. దీంతో చేసేది ఏమీ లేక ఆ కార్యక్రమానికి కూడా వెళ్లాను. ఎవరేమనుకున్నా నేను మౌనంగానే ఉంటాను. తిడితే పడతాను. ఎందుకంటే నేను ఏం చేయలేను కాబట్టి’ అని మౌళి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.
(ఇదీ చదవండి: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్‌కు కీలక సూచన)


