యూట్యూబర్ అయిన మౌళి.. 'లిటిల్ హార్ట్స్' మూవీతో హీరోగా మారి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మరో కామెడీ సినిమాతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదే 'దొంగ నా కొడుకు'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 13న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు మాట్లాడారు.


