ఈ ఏడాది పెద్ది మూవీతో హిట్ కొట్టిన డైరెక్టర్ బుచ్చిబాబు సనా. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించింది. ప్రస్తుతం బుచ్చిబాబు మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. తాజాగా డీఎన్‌కే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సరదాగా మాట్లాడారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిని ఉద్దేశించి బుచ్చిబాబు మాట్లాడారు. మీరు పిలిస్తే రాకపోతే తిడతారో, కొడతారో అన్న భయంతో మీరు ఎప్పుడు పిలిచినా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పరుగెత్తుకుంటూ రావాల్సి వస్తోందన్నారు. ఒక్కో ఈవెంట్‌కు పదివేలు ఇచ్చినా ఈ పాటికో కోకాపేటలో ఫ్లాట్ కొనుక్కునేవాడినని సరదాగా అన్నారు. అన్ని ఈవెంట్లకూ ఉచితంగానే వస్తున్నాం.. కనీసం ఇప్పటినుంచేనా ఈవెంట్‌కు పారితోషికం ఇప్పించండని నిర్మాతను ఉద్దేశించి నవ్వుతూ మాట్లాడారు.
మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మితా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా ‘డీఎన్‌కే’. శ్రీను కంబాల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


