మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ‘ఇట్లు అర్జున’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రం ఆమె రేపు (నవంబర్ 13)న వెండితెరపై సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న అనస్వర.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అభిరుచులు, రొమాంటిక్ డేటింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఆ అబ్బాయిలు అస్సలు నచ్చరు
అబ్బాయిలు మీకు నచ్చాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలనే ప్రశ్నకు అనస్వర తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘అబ్బాయిలు ఎమోషన్స్ పరంగా మెచ్యూరిటీగా వ్యవహరించాలి. మృదువుగా మాట్లాడాలి. ఆల్ఫారకం అబ్బాయిలు అస్సలు నచ్చరు. వారు బయటకి ఎలా ఉన్నా.. వారు మాట్లాడే విధానం, వ్యక్తిత్వమే నాకు ఎక్కువగా నచ్చతాయి’ అని చెప్పింది.
రొమాంటిక్ డేట్ గురించి మాట్లాడుతూ..‘పూలంటే నాకు చాలా ఇష్టం. నాతో డేట్‌కు వచ్చే అబ్బాయి సన్‌ఫ్లవర్స్, వైట్ పియోనీస్ పూలు తీసుకురావాలి. ఇద్దరం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మనసు విప్పి మాట్లాడుకోవాలి’ అని తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. ఇక సినిమా విషయానికి వస్తే.. అనస్వర రాజన్, అనీష్ జంటగా నటించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. నవంబర్ 13న విడుదల కానుంది.
(ఇదీ చదవండి: ‘రామాయణం’పై మహేశ్‌బాబు కొడుకు రివ్యూ)


