సూర్య సీన్ మూవీ.. తొలి హీరోగా రికార్డ్ | Suriya Scene Movie Collects RS 205 crore created new record In kollywood | Sakshi
Sakshi News home page

Scene Movie: సూర్య సీన్ మూవీ.. తొలి హీరోగా రికార్డ్

Nov 11 2026 7:24 PM | Updated on Nov 11 2026 7:24 PM

Suriya Scene Movie Collects RS 205 crore created new record In kollywood

కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ మూవీ సీన్. ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజైంది. జీతు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా.. వసూళ్లపరంగా రాణిస్తోంది. ఈ మూవీ రిలీజైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా  రూ. 205 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఓకే ఏడాదిలో మూడు సినిమాలు రూ.200 కోట్ల మైలురాయి చేరుకున్న హీరోగా సూర్య రికార్డ్ సృష్టించాడు.

ఇప్పటికే ఈ ఏడాది విడుదలైన కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. తాజాగా ఈ జాబితాలో సీన్ మూవీ కూడా చేరింది. ఈ చిత్రం ఐదో రోజు ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద రూ.14.95 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. కాగా.. ఈ చిత్రంలో సూర్య పోలీస్ అధికారిగా కనిపించారు. ఈ మూవీలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో నస్లెన్, ఆనందరాజ్, లాల్, గజరాజ్ కీలక పాత్రలు పోషించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement