ఓటీటీలోకి అదితి రావ్‌ హైదరీ రొమాంటిక్‌ డ్రామా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే.. | Aditi Rao Hydari O Saathi Re Series OTT Streaming Date Out | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి అదితి రావ్‌ హైదరీ ‘ఓ సాథీ రే’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Nov 11 2026 4:45 PM | Updated on Nov 11 2026 4:50 PM

Aditi Rao Hydari O Saathi Re Series OTT Streaming Date Out

తనదైన నటనతో వెండితెరపై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అందాల తార అదితి రావ్‌ హైదరీ. రెండేళ్ల క్రితం ‘హీరామండీ’ సిరీస్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు  ప్రేమికురాలిగా మరో సిరీస్‌తో సందడి చేయడానికి సిద్ధమైంది. అదితి రావ్‌ హైదరీ, అర్జున్‌ రాంపాల్, అవినాశ్‌ తివారీ ప్రధాన పాత్రలు పోషించిన హిందీ రొమాంటిక్‌ డ్రామా సిరీస్‌ ‘ఓ సాథీ రే’((O Saathi Re). ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్‌ అలీ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్‌కు ఆరిఫ్‌ అలీ దర్శకత్వం వహించాడు. 

(చదవండి: కొత్త హీరోకి ఇంత సపోర్టా? డీటైల్స్ ఏంటి?)

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌..త్వరలోనే ఓటీటీలోకి రానుంది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ని ప్రకటించారు మేకర్స్‌.  ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్‌  4 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. వింటేజ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సిరీస్‌  ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement