కొత్త హీరో కోసం ఏకంగా చరణ్, ఎన్టీఆర్, నాగార్జున.. ఎవరీ కుర్రాడు? | Itlu Arjuna Movie Actor Aniesh Full Details | Sakshi
Sakshi News home page

Itlu Arjuna Aniesh Details: కొత్త హీరోకి ఇంత సపోర్టా? డీటైల్స్ ఏంటి?

Nov 11 2026 10:37 AM | Updated on Nov 11 2026 10:43 AM

Itlu Arjuna Movie Actor Aniesh Full Details

ఈ శుక్రవారం(నవంబర్ 13) 'ఇట్లు అర్జున' అనే తెలుగు సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. సాధారణంగా అయితే ఇదో చిన్న మూవీ. కాబట్టి జనాల దృష్టి పడే అవకాశం లేదు. కానీ టాలీవుడ్ స్టార్స్ అయిన నాగార్జున, ఎన్టీఆర్, అఖిల్, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. అసలు కొత్త కుర్రాడు హీరోగా పరిచయమవుతున్న ఓ సినిమా కోసం ఇంతమంది స్టార్స్ రావడం ఎలా సాధ్యమైంది? హీరో బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: వంశీ భార్యని చూశారా? ఎమోషనల్ ఎపిసోడ్)

ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న కుర్రాడి పేరు అనీష్. పూర్తిపేరు అనీష్ రెడ్డి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఏఎంఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి చిన్నకొడుకు. బిజినెస్‌మ్యాన్ అయినప్పటికీ మహేశ్ రెడ్డికి టాలీవుడ్‌తోనూ సంబంధముంది. గతంలో నాగార్జున హీరోగా చేసిన ‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలని ఈయనే నిర్మించారు. అప్పటినుంచి నాగ్‌తో ఈయనకు స్నేహం ఏర్పడింది. అలా మహేశ్ రెడ్డి కొడుకు తొలి సినిమా కోసం నాగ్ తనవంతు సాయం చేస్తున్నారు.

అనీష్ తొలి సినిమా ‘ఇట్లు అర్జున’కు నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమా గ్లింప్స్‌కు కూడా నాగ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ట్రైలర్‌ని లాంచ్ చేసిన ఎన్టీఆర్‌కి కూడా మహేశ్ రెడ్డితో మంచి రిలేషన్ ఉంది. ఇక ఈ చిత్ర మ్యూజిక్ కన్సర్ట్‌కు తన కొడుకు అఖిల్‌తో కలిసి నాగార్జున వచ్చారు. వ్యాపార సంబంధాల దృష్ట్యానే టాలీవుడ్ ప్రముఖులతో అనీష్ కుటుంబానికి సంబంధాలున్నాయి. ఇదే పరిచయాల కారణంగానే రామ్‌చరణ్ కూడా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు.

సాధారణంగా హీరోగా పరిచయమవుతున్నారంటే హీరోల లేదా బిజినెస్‌మ్యాన్ కమర్షియల్ సినిమనే చేస్తుంటారు. కానీ అనీష్ మాత్రం తొలి మూవీకే మూగవాడిలా నటించాడు. మరి ఏ మేరకు మెప్పిస్తాడనేది శుక్రవారం తెలుస్తుంది. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ కాగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించాడు.

(ఇదీ చదవండి: 'ఫేక్' మయం.. టాలీవుడ్‌లో దిగజారుతున్న పరిస్థితులు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement