సల్మాన్ 'మాతృభూమి' ట్రైలర్ రిలీజ్ | Salman Khan Maatrubhumi Trailer Out Now | Sakshi
Sakshi News home page

Salman Khan Maatrubhumi: ఎట్టకేలకు వచ్చిన ట్రైలర్.. ఎలా ఉందంటే?

Nov 11 2026 9:54 AM | Updated on Nov 11 2026 10:03 AM

Salman Khan Maatrubhumi Trailer Out Now

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'మాతృభూమి'. గతంలో 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరుతో ఈ మూవీ తీశారు. కానీ భారత రక్షణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు టైటిల్ మార్చారు. అలానే 40 శాతానికి పైగా సీన్స్ రీషూట్ చేశారు. వచ్చే నెల 04న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.

(ఇదీ చదవండి: 'ఫేక్' మయం.. టాలీవుడ్‌లో దిగజారుతున్న పరిస్థితులు!)

నాలుగున్నర నిమిషాలున్న ఈ ట్రైలర్‌లో సల్మాన్ ఆర్మీ కమాండర్‌గా కనిపించాడు. సరిహద్దుల దగ్గర కాపల కాసే సైనికుడిగా, కుటుంబాన్ని చూసుకునే భర్తగా సల్మాన్ కనిపించనున్నాడు. అయితే ట్రైలర్ ఏమంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. స్టోరీ కూడా ఇదివరకే ఇలాంటి సినిమాల్లో చూసినట్లే ఉంది. ఇలా ట్రైలర్ ఓకే ఓకే అనిపించిన ఈ మూవీతో సల్మాన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: వంశీ భార్యని చూశారా? ఎమోషనల్ ఎపిసోడ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement