వినీత్ చంద్ర, డాలీషా జంటగా నటించిన లేటేస్ట్ మూవీ మిస్ కాలికా మిస్సింగ్. ఈ మూవీకి సత్య ధనేకుల దర్శకత్వం వహిస్తున్నారు. జెఎస్‌వీవీ ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రామకృష్ణ, పదిమల యమున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఈ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా నిర్మాతలు రామకృష్ణ, యమునలు మాట్లాడుతూ.."ప్రేక్షకులందరికీ పరిచయం ఉన్న ఆర్టిస్టులతో మేము తీసిన మిస్ కాళికా మిస్సింగ్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మా చిత్రం పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్. మునుపెన్నడు చూడని కథనంతో ఈ మూవీని తెరకెక్కించాం. ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పరంగా ఈ చిత్రం మంచి మార్కులు తెచ్చుకుంటుంది .ఈ చిత్రాన్ని ఈ నెలాఖరుకు ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు . ఈ చిత్రంలో ఎస్తేర్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ ,ఆలీ ,జ్యోతి, నాగ మహేష్, గుండు సుదర్శన్ కీలక పాత్రల్లో నటించారు.


