రిలీజ్‌కు ముందే డైరెక్టర్‌కు అదిరిపోయే గిప్ట్‌ ఇచ్చిన స్టార్‌ హీరో! | Sivakarthikeyan Surprises Director Ramkumar Balakrishnan With A Special Gift | Sakshi
Sakshi News home page

రిలీజ్‌కు ముందే డైరెక్టర్‌కు అదిరిపోయే గిప్ట్‌ ఇచ్చిన స్టార్‌ హీరో!

Nov 3 2026 7:45 PM | Updated on Nov 3 2026 8:04 PM

Sivakarthikeyan Surprises Director Ramkumar Balakrishnan With A Special Gift

ఒక సినిమా హిట్ అయితే హీరోకి నిర్మాత బహుమతి ఇవ్వడం.. లేదంటే హీరో తన డైరెక్టర్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం చూస్తుంటాం. ఈ మధ్య సంగీత దర్శకులకు కూడా ఖరీదైన కానుకలు అందిస్తున్నారు. అయితే ఇలాంటి బహుమతులన్నీ సాధారణంగా సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాతే ఉంటాయి. కానీ కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. సినిమా ఇంకా విడుదల కాకముందే తన డైరెక్టర్‌కు ఖరీదైన ఐఫోన్‌ను బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం శివకార్తికేయన్ తన 27వ చిత్రంలో నటిస్తున్నాడు. 'పార్కింగ్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ అవార్డు విజేత రామకుమార్ బాలకృష్ణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఇందులో శివకార్తికేయన్‌కు జోడీగా కయాదు లోహర్ నటిస్తుండగా.. యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు రామకుమార్‌కు హీరో శివకార్తికేయన్ ఊహించని కానుక అందించాడు. ఫస్ట్ షెడ్యూల్ అవుట్‌పుట్ అద్భుతంగా రావడంతో పాటు దర్శకుడి టేకింగ్‌కు ఫిదా అయిన శివకార్తికేయన్.. ఆయనకు బ్రాండ్ న్యూ ఐఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో దర్శకుడు ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న రామకుమార్.. 'శివకార్తికేయన్ అన్న నుంచి ఒక లవ్లీ సర్‌ప్రైజ్ వచ్చింది. థ్యాంక్స్ అన్నా.. ఇది నాకు చాలా ప్రత్యేకమైనది' అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా విడుదల కాకముందే దర్శకుడి పనితీరును మెచ్చుకుంటూ హీరో ఇలాంటి ఖరీదైన బహుమతి ఇవ్వడంపై అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

(చదవండి: రావణుడి పది తలలకు.. పది గొంతులు ..​)

ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గతంలో ఇదే తరహా నేపథ్యంలో శివకార్తికేయన్ నటించిన 'డాన్' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి కాలేజ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శివకార్తికేయన్ 'సీయోన్' అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది. మరి ఈ రెండు సినిమాలతో శివకార్తికేయన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలు అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement