'నా కెరీర్‌లో చాలా తప్పులు చేశా'.. సూర్య ఎమోషనల్ | Kollywood Hero Suriya Emotional at Scene Pre release Event | Sakshi
Sakshi News home page

Suriya: 'ప్రతిసారి నా చేయి పట్టుకుంది తనే'.. సూర్య ఎమోషనల్

Nov 3 2026 4:55 AM | Updated on Nov 3 2026 4:55 AM

Kollywood Hero Suriya Emotional at Scene Pre release Event

సూర్య, నజ్రియా నజీమ్‌ జంటగా నటించిన తాజా చిత్రం సీన్‌. ఆవేశం ఫేమ్‌ జితు మాధవన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్  మెంట్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. జయశ్రీ దామోదరన్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 6న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలో సీన్‌ ట్రైలర్‌ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా తన భార్య జ్యోతికపై సూర్య ప్రశంసలు కురిపించారు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి, నా జీవితంలో ప్రతిదీ సరిగ్గా జరగడానికి ప్రతి అడుగులోనూ నా చెయ్యి పట్టుకుని నడిపించింది తనేనని అన్నారు. ఆమె నా ఉత్తమ తల్లి,  స్నేహితురాలు, జీవిత భాగస్వామి. బలమైన మహిళ..  థ్యాంక్యూ జో.. అంటూ ఎమోషనల్ అయ్యారు. నా కెరీర్‌లో నేను చాలా తప్పులు చేశా.. చాలాసార్లు కింద పడ్డా. ప్రతిసారి నా చేయి పట్టుకుని తీసుకెళ్లిన వ్యక్తి నా భార్య జ్యోతికనే ‍అంటూ కొనియాడారు. నా జీవితంలో నా వెంటే ఉంటూ నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు నీకు రుణపడి ఉంటానని అన్నారు.  కాగా.. ఈ మూవీలో నస్లేన్, ఆనంద్‌ రాజ్, లాల్, రాజ్‌ ప్రియన్‌ కీలక పాత్రలు పోషించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement