కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తర్వాత ఈ మూవీతో మరోసారి వీరిద్దరు జతకట్టనున్నారు. తాజాగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌కు అజిత్ సతీమణి కూడా హాజరయ్యారు.
ఈ మూవీలో అజిత్ సరసన కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా మెప్పించనుంది. టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు. ఈ సినిమాకు క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. డేర్ డెవిల్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ తర్వాత అధిక్ డైరెక్షన్‌లో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
#DareDevil is here💥🎲🔥💥 Thank you dear #Ajith sir #Shalini mam @Braveheartsprod @anirudhofficial sir @SureshChandraa sir @Iamunnimukundan sir @sreeleela14 @rparthiepanb sir @suneeltollywood sir @AbinandhanR @editorvijay @supremesundar #Subbhunaarayan @itsanuvardhan @kayoas13 @valentino_suren @Donechannel1 @AbdulNassarOffl @AMBANINSK @riseandroar_inc
— Adhik Ravichandran (@Adhikravi) November 2, 2026


