వైల్డ్‌ లుక్‌లో రష్మిక.. రోమాలు నిక్కబొడుచుకునేలా ‘ ఓ మైసా’ సాంగ్‌ | O Mysaa Re Lyrical Song Out From Rashmika Mysaa Movie | Sakshi
Sakshi News home page

ఉగ్రరూపంలో నేషనల్‌ క్రష్‌.. రోమాలు నిక్కబొడుచుకునేలా ‘ ఓ మైసా’ సాంగ్‌

Nov 2 2026 8:13 PM | Updated on Nov 2 2026 8:19 PM

O Mysaa Re Lyrical Song Out From Rashmika Mysaa Movie

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా  యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మైసా’. ఇందులో ఆమె పవర్ ఫుల్ అవాతర్ లో  కనిపించనున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పోస్టర్లకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ ఈ రోజు సినిమా నుంచి తొలి పాట ‘ఓ మైసా రే’ ను విడుదల చేశారు.

(చదవండి: జాగ్రత్తా.. నాకు 5 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు : అమితాబ్‌ వార్నింగ్‌)

జేక్స్ బిజోయ్ అందించిన ఇంటెన్స్, పవర్‌ఫుల్ మ్యూజిక్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఉరుముల్లాంటి బీట్స్‌తో సాగే ఈ పాట ఆద్యంతం అదే టెంపో, ఎనర్జీని కొనసాగిస్తూ ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది. సుద్దాల అశోక్ తేజ రాసిన సాహిత్యం మైసాను ఈషి, ఐషి రూపాల్లో ఆవిష్కరిస్తూ దైవిక స్త్రీ శక్తిని,  అర్ధనారీశ్వర స్వరూపాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళల శక్తి సామర్థ్యాలను కీర్తిస్తూ, ధైర్యంగా నిలబడి యుద్ధానికి సిద్ధం కావాలనే స్ఫూర్తిని ఈ పాటలోని పదాలు బలంగా చాటుతున్నాయి. ఈ సినిమాలో.. రష్మిక శక్తిమంతమైన గిరిజన గోండు మహిళ పాత్రలో అలరించనున్నారు. నవంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement