జాగ్రత్తా.. ఒక్క పిలుపిస్తే చాలు..! అమితాబ్‌ మాస్‌ వార్నింగ్‌! | Amitabh Bachchan Slams Media For Misinterpreting His Religious Chant | Sakshi
Sakshi News home page

జాగ్రత్తా.. నాకు 5 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు : అమితాబ్‌ వార్నింగ్‌

Nov 2 2026 6:27 PM | Updated on Nov 2 2026 7:05 PM

Amitabh Bachchan Slams Media For Misinterpreting His Religious Chant

తన మాటలను వక్రీకరిస్తూ వార్తను ప్రచురించిన ఓ మీడియా సంస్థపై బాలీవుడ్‌ సీనియర్‌ హీరో, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఫైర్‌ అయ్యారు. తనకు 5 కోట్ల మంది ఫాలోవర్స్‌ఉన్నారని.. ఒక్క పిలుపు ఇస్తే చాలు.. మిమ్మల్ని నిలదీయడానికి రెడీగా ఉంటారని హెచ్చరించారు.

అసలేం జరిగింది..?
అమితాబ్‌ బచ్చన్‌ ఇటీవల శ్రీకృష్ణుడినికీర్తిస్తూ ‘హాథీ ఘోడా పల్కీ.. జై కన్హయ్య లాల్‌ కీ..’ అనే కీర్తనను పోస్ట్‌ చేశారు. దాని గురించి ఓ మీడియా సంస్థ వార్తను ప్రచురిస్తూ.. అందులో అమితాబ్‌  తన ప్రత్యర్థులకు సవాల్‌విసిరాడని, ఏనుగులు, గుర్రాలను తెచ్చుకోండి.. మేము మా ఆయుధాలతో పోరాటం చేస్తామని హెచ్చరించాడని పేర్కొన్నారు. ఈ వార్త అమితాబ్‌కి ఆగ్రహం తెప్పించింది. తన మాటలను మాత్రమే కాదు శ్రీకృష్ణుడి కీర్తనను కూడా సదరు మీడియా సంస్థ అవమానించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టారు.

(చదవండి: అభిమానుల కోసం బిగ్‌బీ బిగ్‌ రిస్క్‌.. బెదిరింపులు వచ్చినప్పటికీ..)

ఒక్క పిలుపునిస్తే చాలు.. 
‘హాథీ ఘోడా పాల్కీ.. జై కన్హయ్య లాల్ కీ..’ అంటే ఏనుగులు, గుర్రాలు, పల్లకితో కొలువుదీరిన శ్రీకృష్ణుడికి జైజైలు అని అర్థం. కానీ, మీడియా ఈ పవిత్రమైన నినాదాన్ని వక్రీకరించి, తమ ప్రచారం కోసం వాడుకుంటోంది. ‘అమితాబ్ తన ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. ఏనుగులు, గుర్రాలు తీసుకురండి.. మేం మా ఆయుధాలతో పోరాడతాం.. భయపడేది లేదు’ అని అన్నట్లుగా వార్తలు ప్రచురిస్తోంది. ఒకవైపు ‘జై శ్రీకృష్ణ’ అనే పవిత్ర నామస్మరణను అవమానించడం.. మరోవైపు నా మాటలను ప్రత్యర్థులకు సవాల్ విసిరినట్లుగా వక్రీకరించడం.. ఇదీ మీడియా తీరు!

మీడియా మిత్రులారా.. చెవులు పెద్దవి చేసుకుని వినండి. నాకు 5 కోట్ల మంది అనుచరులు ఉన్నారు. ఒక్కసారి పిలుపునిస్తే, వారిలో 10 శాతం మంది రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు మా మాటలను ఎంతగా వక్రీకరించి, వాటిని ఖండిస్తారో.. మీకు అదే స్థాయిలో బదులిచ్చే సామర్థ్యం మా అభిమానుల బృందానికి వంద రెట్లు ఎక్కువగా ఉంది. వాళ్లు నోరు విప్పడమే ఆలస్యం’ అని అమితాబ్‌ హెచ్చరించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement