జీవితం అనేది ఎప్పుడు ఎలా మారుతుందో అస్సలు చెప్పలేం. కొన్నిసార్లు చాలా తక్కువ టైంలోనే ఎవరూ ఊహించని విధంగా టర్న్ అవుతుంది. తమిళ యువ నటుడు, దర్శకుడు అభిషన్ జీవింత్ లైఫ్ ఇలానే మారింది. ఏడాదిన్నరలో మంచి ఫేమ్ వచ్చింది. ప్రేమించిన అమ్మాయితో పెళ్లయింది. ఇప్పుడు ఓ బిడ్డకు తండ్రి కూడా అయిపోయాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ లేడీ కంటెస్టెంట్ లవ్.. పేరెంట్స్ ఎంట్రీతో మారిన సీన్)
స్వతహాగా యూట్యూబర్ అయిన అభిషన్ జీవితం.. గతేడాది ఏప్రిల్‌లో రిలీజైన 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇందులోనే ఓ పాత్ర కూడా చేశారు. బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ దెబ్బకు అభిషన్ ఫేమస్ అయ్యాడు. అలా 'విత్ లవ్' అనే సినిమాతో హీరోగా మారి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం హీరోగా చేస్తున్న ఓ సినిమాలో ఏకంగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
అసలు విషయానికొస్తే.. గతేడాది అక్టోబర్ 31న తన చిన్ననాటి స్నేహితురాలు అఖిలని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. 'టూరిస్ట్ ఫ్యామిలీ' ప్రమోషన్ల టైంలో స్టేజీపైనే ప్రపోజ్ చేయడం విశేషం. ఇప్పుడు సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఆడబిడ్డకు తండ్రయ్యాడు. తన భార్యకు పాప పుట్టిందని చెబుతూ క్యూట్ పోస్ట్ పెట్టాడు. దీంతో తోటి సెలబ్రిటీలు ఇతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. 27 ఏళ్లకే స్టార్‌డమ్ రావడంతో పాటు తండ్రి కూడా అయిపోయాడు.
(ఇదీ చదవండి: నాలుగేళ్ల క్రితం మన జీవితం ఇక్కడే మొదలైంది.. నటి మహాలక్ష‍్మి క్యూట్ పోస్ట్)


