breaking news
Abishan Jeevinth
-
ఓటీటీలో హిట్ సినిమా.. విత్ లవ్ రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకుడిగా, హీరోగా తొలి సినిమాలకే హిట్టు కొట్టి సెన్సేషన్ అయ్యాడు అభిషన్ జీవింత్. ఇతడు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం ఏకంగా రూ.90 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. నెక్స్ట్ సినిమా ఎవరితో అనుకుంటున్న తరుణంలో ఈ యంగ్ డైరెక్టర్ హీరోగా మారాడు. విత్ లవ్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు.ఓటీటీలో విత్ లవ్అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించాడు. సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా వ్యవహరించింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా విత్ లవ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తుంది. మార్చి 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి మరి.కథేంటంటే?సత్య (అభిషన్ జీవింత్) ఆర్కిటెక్ట్.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అలా ఒకరోజు అక్క బలవంతంతో కాఫీ షాప్‌లో ఓ అమ్మాయిని చూసేందుకు వెళ్తాడు. ఆ అమ్మాయే మోనీషా (అనస్వర రాజన్). మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్లో చదివామని, ఇద్దరూ సీనియర్- జూనియర్ అని తెలుస్తుంది. తమ చిన్నతనంలో ఎవర్నైతే ప్రేమించారో వారిని ఒకసారి కలవాలనుకుంటారు. మరి తర్వాతేం జరిగింది? వాళ్లని కలిశారా? ఈ పెళ్లి చూపులు ఏమయ్యాయి? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే! #WithLove will be streaming from March 6 on NETFLIX. pic.twitter.com/IoSzc2TXwW— Christopher Kanagaraj (@Chrissuccess) March 1, 2026 చదవండి: దుబాయ్‌లో చిక్కుకున్నా.. నన్ను భారత్‌కు తీసుకురండి: బాలీవుడ్ నటి -
అప్పుడు రూ.500 అప్పు.. ఇప్పుడు రూ.90 కోట్ల కలెక్షన్స్!
ఏదో ఒక కథ రాసుకున్నామా? పెద్ద హీరోను పెట్టామా? రెండు ఫైట్ సీన్లు, రెండు లవ్ సాంగ్స్‌తో మమ అనిపించేశామా? అంటే కుదరదు. ఈరోజుల్లో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే వారి మనసును కదిలించేలా సినిమా ఉండాలి. వారు పెట్టిన డబ్బుకు సంతృప్తినిచ్చేదై ఉండాలి. అలాగైతేనే జనం సినిమాకు ఓటేస్తున్నారు, లేదంటే మూవీ చిన్నదైనా, పెద్దదైనా జనం ముఖం చాటేస్తున్నారు.ఫస్ట్ సినిమాతోనే హిట్అలాంటిది తొలి సినిమాతోనే టాలెంట్ చూపించాడు తమిళ దర్శకుడు అభిషన్ జీవింత్. యూట్యూబర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అతడు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అభిషన్. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది మే 1న విడుదలవగా ప్రేక్షకులను నవ్విస్తూనే హృదయాలను కదిలించింది. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ప్రేమ వివాహంపెద్ద డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయకపోయినప్పటికీ సొంత టాలెంట్‌తో గొప్ప సినిమా తీసి అందరి మన్ననలు పొందాడు. రజనీకాంత్, సూర్య, రాజమౌళి, నాని.. ఇలా ఎందరో ప్రముఖులు ఆయన ప్రతిభను ప్రశంసించారు. ఈ ఆనందంలోనే అభిషన్.. ప్రియురాలిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ వివాహానికి టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మగేశ్ రాజు హాజరై బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చాడు. హీరోగానూ టాలెంట్ఇక దర్శకుడిగా నెక్స్ట్ ఏం సినిమా చేస్తాడు? అనుకుంటే హీరోగా మారాడు. విత్ లవ్ మూవీతో కథానాయకుడిగానూ విజయం సాధించాడు. అయితే ఒకప్పుడు అభిషన్ రోజూవారీ ఖర్చుల కోసం రూ.500 స్నేహితుడిని అప్పడిగాడు. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు బాక్సాఫీస్‌పై కోట్లు కురిపించే సినిమాలు తీసే రేంజ్‌కు ఎదిగాడు. 26 ఏళ్ల వయసులోనే ఇంత సక్సెస్ చూస్తున్న అభిషన్ మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిద్దాం!చదవండి: ఆ హీరోయిన్‌కు ఫోన్ చేసి సారీ చెప్పా: రవీనా టండన్ -
సినిమా బాగుంది, నీకు మంచి భవిష్యత్తుంది బ్రదర్!
'టూరిస్ట్ ఫ్యామిలీ'తో దర్శకుడిగా సత్తా చాటిన అభిషన్ జీవింత్ 'విత్ లవ్' మూవీతో హీరోగా మారాడు. అనస్వర రాజన్ కథానాయికగా నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 6న విడుదలయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమాపై తెలుగు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశంసలు కురిపించాడు.విత్ లవ్‌పై ప్రశంసలువిత్ లవ్ సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. ఇటీవలి కాలంలో వచ్చిన ఆహ్లాదకరమైన సినిమా ఇది. ముఖ్యంగా తెలుగు డైలాగులు సందర్భోచితంగా, నీట్‌గా ఉన్నాయి. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. షాన్ రోల్డన్ సంగీతం సినిమాకు చాలా చక్కగా కుదిరింది.మంచి భవిష్యత్తుతొలి సినిమాకే ఇంతమంచి ప్రతిభ చూపించిన దర్శకుడు మధన్ను మెచ్చుకుని తీరాల్సిందే! సోదరా.. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ క్యూట్ మూవీ నిర్మించిన సౌందర్య రజనీకాంత్, మగేశ్కు శుభాకాంక్షలు. అలాగే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన రానా దగ్గుబాటికి ప్రత్యేక అభినందనలు అని ట్వీట్ చేశాడు.దర్శకుడి నుంచి హీరోగా..అభిషన్ జీవింత్ యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో డైరెక్టర్‌గా మారాడు. తొలి సినిమాకే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ పాత్ర పోషించాడు. ఇకపోతే గతేడాది అతడు ప్రేయసి అఖిల మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ పెళ్లికి హాజరైన టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మగేశ్ రాజ్.. అభిషన్‌కు కారు గిఫ్ట్ ఇచ్చాడు. Truly enjoyed watching #WithLove 🩶A breezy, well-made rom-com in recent times with very apt and neatly penned Telugu dialogues.@Abishanjeevinth & #AnaswaraRajan feels spot on, and @RSeanRoldan’s music works beautifully.Kudos to @madhann_n on a fantastic debut. Long way to…— Anil Ravipudi (@AnilRavipudi) February 8, 2026 చదవండి: సర్వం మాయ హిట్.. తండ్రికి దర్శకుడి విలువైన కానుక -
రాజమౌళి సార్ అలా చేస్తారని ఊహించలేదు: టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్
టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ చిత్రంలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో హీరో అభిషన్ జీవింత్ మాట్లాడారు.టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ గురించి అభిషన్ జీవింత్ కామెంట్స్ చేశారు. నా సినిమాకు రాజమౌళి సార్ ట్వీట్ చేస్తారని అస్సలు ఊహించలేదన్నారు. ఆయన వల్లే నా సినిమా తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరైందని అన్నారు. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం గురించి ట్వీట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ అంటూ మాట్లాడారు. మీ వల్లే ఆ సినిమా నాకు ప్రత్యేకంగా గుర్తుండి పోతుందని అభిషన్ ఆనందం వ్యక్తం చేశారు.కాగా.. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం విత్ లవ్. ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజ్ కానుంది.రాజమౌళి గారు టూరిస్ట్ ఫ్యామిలీ గురించి ట్వీట్ చేస్తారని అస్సలు ఊహించలేదు..ఆయన ట్వీట్ తర్వాత నా సినిమా తెలుగు ఆడియన్స్ కి చేరువైంది#AbishanJeevinth #AnaswaraRajan #SoundaryaRajinikanth #Madhan #WithLove pic.twitter.com/JaWNxhAI2o— Filmy Focus (@FilmyFocus) January 30, 2026 -
అనస్వర రాజన్ మూవీ విత్ లవ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కాలేజీ ప్రేమకథా చిత్రం 'విత్ లవ్'.. ఆసక్తిగా ట్రైలర్
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ మూవీలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే కాలేజీ నేపథ్యంలోనే సాగే ఫీల్ గుడ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజినీకాంత్, మాగేశ్ రాజ్ నిర్మించారు. -
పెళ్లి చేసుకున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే పెళ్లి విషయంలో కాస్త ఆలస్యం చేస్తుంటారు. ఈ ఏడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అభిషన్ జీవింత్ అనే కుర్రాడు.. ఇప్పుడు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాడు. చాన్నాళ్లుగా ప్రేమిస్తున్న అఖిల అనే అమ్మాయికి మూడు ముళ్లు వేశాడు. శుక్రవారం ఉదయం చెన్నైలోని పోయెస్ గార్డెన్లో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించి ఓ ఫొటో కూడా బయటకొచ్చింది.(ఇదీ చదవండి: నటిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ చిన్న కూతురు)యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అభిషన్.. 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో దర్శకుడిగా మారి అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రూ.7 కోట్ల బడ్జెట్ పెడితే దాదాపు రూ.80-90 కోట్ల కలెక్షన్ ఈ మూవీకి వచ్చాయి. ఇదే చిత్రంలోనూ నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. రీసెంట్గా హీరోగా ఓ మూవీ పూర్తి చేశాడు. రజనీకాంత్ కూతురు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్.మరోవైపు అభిషన్కి రీసెంట్‌గానే 'టూరిస్ట్ ఫ్యామిలీ' నిర్మాత మగేశ్ రాజ్.. ఖరీదైన బీఎండబ్ల్యూ కారుని పెళ్లి బహుమతిగా ఇచ్చాడు. గురువారం చెన్నైలో రిసెప్షన్ జరగ్గా.. పలువురు తమిళ సినీ సెలబ్రిటీలు హాజరైన కొత్త జంటని దీవించారు. ఇప్పుడు పెళ్లి కూడా జరగడంతో నూతన వధూవరుల్ని కూడా ఆశీర్వదిస్తున్నారు. పెళ్లి వేడుకకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ ఫాంటసీ రొమాంటిక్ సినిమా) -
'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడితో నాని.. పోస్ట్ వైరల్
రీసెంట్ టైంలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'. మే 1న తమిళంలో రిలీజైన ఈ చిత్రం.. దాదాపు నెలరోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ఆకట్టుకుంది. కేవలం రూ.5 కోట్లు పెడితే రూ.75 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. ఇదే మూవీలో అభిషన్ జీవింత్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి మూవీతోనే టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. ఇప్పుడు ఇతడు హీరో నానిని కలిశాడు.(ఇదీ చదవండి: హైదరాబాద్ జట్టు ఓనర్‌తో అనిరుధ్ పెళ్లి?) 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా థియేటర్లలో ఉండగానే నాని చూసి తన రివ్యూ ఇచ్చేశాడు. దర్శకుడు అభిషన్‌ని మెచ్చుకున్నాడు. నానితో పాటు రాజమౌళి కూడా ఈ మూవీకి ఫిదా అయిపోయారు. అలాంటిది ఇప్పుడు అభిషన్‌ని నాని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సినిమా గురించి చాలా డీటైలింగ్‌గా మాట్లాడటం తనకెంతో ప్రత్యేకంగా అనిపించిందని కుర్ర డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. నానిని కలవడం తనకు గౌరవంగా ఉందని కూడా అన్నాడు.రీసెంట్ టైంలో నాని ఓవైపు హీరోగా చేస్తూనే.. 'కోర్ట్' లాంటి చిన్న సినిమాలు తీస్తూ నిర్మాతగానూ తన అభిరుచి చాటుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు అభిషన్‌ని కలిసి మాట్లాడాడు అంటే త్వరలో వీళ్లిద్దరూ కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ మన దగ్గర థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఓటీటీలో తెలుగు వెర్షన్‌ని నేరుగా అందుబాటులోకి తీసుకొచ్చారు. చూసిన ప్రతిఒక్కరూ సినిమాకు ఫిదా అయిపోతున్నారు. చూడాలి మరి అభిషన్-నాని కాంబో ఏమైనా సెట్ అవుతుందేమో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) View this post on Instagram A post shared by Abishan Jeevinth (@abishan_jeevinth)


