కాలేజీ ప్రేమకథా చిత్రం 'విత్ లవ్'.. ఆసక్తిగా ట్రైలర్ | Abhishan, Jeevinth and Anaswara Rajan Movie With Love Telugu Trailer | Sakshi
Sakshi News home page

With Love Telugu Trailer: ఛాంపియన్ హీరోయిన్ కొత్త సినిమా.. ఆసక్తిగా ట్రైలర్

Jan 30 2026 5:30 PM | Updated on Jan 30 2026 5:35 PM

Abhishan, Jeevinth and Anaswara Rajan Movie With Love Telugu Trailer

టూరిస్ట్‌ ఫ్యామిలీ మూవీతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్‌ జీవింత్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ మూవీలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే కాలేజీ నేపథ్యంలోనే సాగే ఫీల్ గుడ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజినీకాంత్, మాగేశ్ రాజ్ నిర్మించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement