టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ చిత్రంలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో అభిషన్ జీవింత్ మాట్లాడారు.
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ గురించి అభిషన్ జీవింత్ కామెంట్స్ చేశారు. నా సినిమాకు రాజమౌళి సార్ ట్వీట్ చేస్తారని అస్సలు ఊహించలేదన్నారు. ఆయన వల్లే నా సినిమా తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరైందని అన్నారు. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం గురించి ట్వీట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ అంటూ మాట్లాడారు. మీ వల్లే ఆ సినిమా నాకు ప్రత్యేకంగా గుర్తుండి పోతుందని అభిషన్ ఆనందం వ్యక్తం చేశారు.
కాగా.. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం విత్ లవ్. ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజ్ కానుంది.
రాజమౌళి గారు టూరిస్ట్ ఫ్యామిలీ గురించి ట్వీట్ చేస్తారని అస్సలు ఊహించలేదు..
ఆయన ట్వీట్ తర్వాత నా సినిమా తెలుగు ఆడియన్స్ కి చేరువైంది#AbishanJeevinth #AnaswaraRajan #SoundaryaRajinikanth #Madhan #WithLove pic.twitter.com/JaWNxhAI2o— Filmy Focus (@FilmyFocus) January 30, 2026


