మన పురాణాల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. వాటిలో పుష్పక విమానం ఒకటి. అప్పట్లోనే ఆకాశంలో ప్రయాణించే విమానం గురించి రామాయణంలో చెప్పినట్లు చాలామంది చాలా సందర్భాల్లో వినేవుంటారు. ఇప్పుడు ఇదే అంశాన్ని బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ప్రస్తావించారు.
ఇటీవల టీవీ యాంకర్ సుమ నిర్వహించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో రణ్‌బీర్ కపూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్, యష్, దర్శకుడు నితేశ్ తివారీ కూడా పాల్గొన్నారు. రాబోయే రామాయణ సినిమాలో అద్భుతమైన సన్నివేశాలు, ఆయుధాలు, పురాణ పాత్రలను ఎలా చూపించబోతున్నారనే విషయంపై వీరి మధ్య చర్చ జరిగింది.
ఈ సందర్భంగా రణ్‌బీర్ మాట్లాడుతూ.. ''ఎలాన్ మస్క్ ఇటీవల ఫ్లయింగ్ కారును రూపొందించారు. కానీ మన భారతదేశంలో 5,000 ఏళ్ల క్రితమే ఇలాంటిది ఉంది'' అంటూ పుష్పక విమానాన్ని గుర్తుచేశారు. రామాయణ సినిమాలో శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న రణ్‌బీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పుష్పక విమానం తయారీకి రెండేళ్లు!
ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు నితేశ్ తివారీ కూడా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. సినిమాలో పుష్పక విమానాన్ని రూపొందించడానికి దాదాపు రెండేళ్లు పట్టిందట. మొదట అనుకున్న డిజైన్ ఒకలా ఉండగా, చివరకు దాన్ని మరికొంత మార్చాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా.. రావణుడు, జటాయువు మధ్య జరిగే పోరాట సన్నివేశాల రూపకల్పనలో ఈ మార్పులు ప్రభావం చూపించాయట. విమానం డిజైన్ మారడంతో అప్పటికే సిద్ధం చేసిన యాక్షన్ సన్నివేశాలను కూడా పలుమార్లు మార్చాల్సి వచ్చిందని నితేశ్ తెలిపారు.
పుష్పక విమానం ఎవరిది?
రామాయణం ప్రకారం.. పుష్పక విమానాన్ని దేవతల శిల్పి విశ్వకర్మ రూపొందించారు. మొదట బ్రహ్మదేవుడి కోసం దీనిని తయారు చేయగా, ఆ తర్వాత కుబేరుడికి బహుమతిగా ఇచ్చారు. రావణుడు తన కుబేరుడిని ఓడించి ఈ విమానాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పురాణ కథనాలు చెబుతున్నాయి.
ఈ విమానానికి ఉన్న ప్రత్యేకతలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. మనసు వేగంతో ప్రయాణించగలదని, ఎంతమంది ప్రయాణికులు ఉన్నా అందుకు తగ్గట్టుగా తన పరిమాణాన్ని పెంచుకోగలదని రామాయణంలో వర్ణించారు.
ఎలాన్ మస్క్ ఫ్లైయింగ్ కారు
ఎలాన్ మస్క్‌కు చెందిన ఎగిరే టెస్లా రోడ్‌స్టర్ కారు గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనిని అక్టోబర్ 15న టెక్సాస్‌లోని వాకోలో జరిగిన కార్యక్రమంలో ప్రదర్శించారు. స్పేస్‌ఎక్స్ కేంద్రంలో జరిగిన ఈ ప్రదర్శనలో కారు ఒక వంపు ఆకారంలోని ర్యాంప్‌పై తలకిందులుగా ప్రయాణించి, గాల్లో పల్టీ కొట్టి తిరిగి సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Ranbir Kapoor On Elon Musk's Tesla Roadster 😭 I must also add that Elon Musk recently invented a flying car , i think India did it 5000 two days back , india did 5000 back #Ramayana https://t.co/s4kA8JwbNH
— Filmy_Duniya (@ayaanpanda1) October 31, 2026


