అభిమానుల కోసం బిగ్‌బీ బిగ్‌ రిస్క్‌.. బెదిరింపులు వచ్చినప్పటికీ.. | Amitabh Bachchan Meets Fans With Bullet Proof Shield On Sunday | Sakshi
Sakshi News home page

అభిమానుల కోసం బిగ్‌బీ బిగ్‌ రిస్క్‌.. బెదిరింపులు వచ్చినప్పటికీ..

Nov 2 2026 4:07 PM | Updated on Nov 2 2026 4:23 PM

Amitabh Bachchan Meets Fans With Bullet Proof Shield On Sunday

సినీ తారల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న వేళ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభిమానులతో నేరుగా మమేకమయ్యే తన చిరకాల సంప్రదాయానికి భద్రతా జాగ్రత్తలను జోడించారు. ప్రతి ఆదివారం ముంబైలోని తన నివాసం ‘జల్సా’ వెలుపలకు వచ్చి అభిమానులకు అభివాదం చేసే బిగ్‌బీ.. ఈసారి మాత్రం బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ షీల్డ్ వెనుక నిలబడి కనిపించారు. ఇటీవల ఆయన నివాసానికి వచ్చిన బెదిరింపులు, బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఈ అదనపు భద్రతా ఏర్పాట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అమితాబ్ బచ్చన్ నివాసం జల్సాపై దాడి చేస్తామంటూ అక్టోబర్ 23న ముంబై మేయర్‌కు ఓ ఈమెయిల్ వచ్చింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 మధ్య దాడి జరగవచ్చని అందులో హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమితాబ్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

(చదవండి: తిరుపతిలో మొదలైన నటి ప్రేమకథ.. క్యూట్ పోస్ట్)

అమితాబ్ బచ్చన్‌కు ప్రతి ఆదివారం అభిమానులను కలుసుకోవడం ఓ ప్రత్యేకమైన సంప్రదాయం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆనవాయితీలో భాగంగా ఆయన తన ఇంటి వెలుపలకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తుంటారు. అయితే, తాజాగా ఆయన చుట్టూ పారదర్శకమైన బుల్లెట్‌ప్రూఫ్ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

గతంలో అభిమానులకు దగ్గరగా కనిపించే బిగ్‌బీ.. ఈ వారం మాత్రం రక్షణ కవచం వెనుక నుంచి అభివాదం చేశాడు. ఈ ఏర్పాట్లను ఆయన వ్యక్తిగతంగా చేయించుకున్నారా? పోలీసుల సూచనల మేరకు ఏర్పాటు చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement