breaking news
bullet proof glasses
-
బాల్కనీలో బుల్లెట్ ఫ్రూఫ్ కవచం.. తన కోసం కాదన్న సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ ఏడాది సికందర్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించగా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్‌బాస్ సీజన్‌కు హోస్ట్‌గా చేయనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గాల్వాన్ లోయలో 2020లో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంతో వస్తోన్న ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రంలో సల్మాన్ నటిస్తున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.అయితే సల్మాన్ ఖాన్‌కు పలుసార్లు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. కృష్ణ జింకను వేటాడిన కేసు తర్వాత సల్మాన్‌ను చంపేస్తామంటూ చాలాసార్లు బెదిరించారు. దీంతో ముంబయిలోని తన ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే తాను నివాసముండే గెలాక్సీ అపార్ట్మెంట్లోని బాల్కనీలో బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా అభిమానులకు విషెస్ చెబుతూ ఉంటారు.అయితే తాజా ఇంటర్వ్యూలో ఆ బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేయడంపై సల్మాన్ ఖాన్ స్పందించారు. అయితే ఇది తన వ్యక్తిగత రక్షణ కోసం కాదని.. నా అభిమానులు కొందరు బాల్కనీ పైకి ఎక్కకుండా.. వారిని తన ఇంట్లోకి రాకుండా నివారించేందుకేనని తెలిపారు. అయినప్పటికీ కొందరు ఫ్యాన్స్ బాల్కనీ పైకి ఎక్కి నిద్రిస్తున్నారని సల్మాన్ ఖాన్ వివరించారు.అయితే ఇటీవల సల్మాన్ నివాసం వెలుపల ప్రత్యక్షంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ సంఘటన తర్వాత సల్మాన్ ఖాన్ బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేయించారు. అంతే కాకుండా కారులో బాంబు పెడతామని కూడా బెదిరించారు. కొంతకాలంగా సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారు పలుమార్లు సల్మాన్ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై పోలీసులు సల్మాన్‌కు భద్రత కల్పించారు. -
బుల్లెట్ ప్రూఫ్ అద్దాలా.. నాకొద్దు
ఎర్రకోట మీద జెండా ఎగరేసేటప్పుడు ఈసారి డ్రోన్లతో కూడా దాడులు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించినా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్టించుకోలేదు. ఇప్పటికి వరుసగా మూడో ఏడాది ఆయన బుల్లెట్ ప్రూఫ్ వేదిక లేకుండా.. బహిరంగ వేదిక నుంచే ప్రసంగించారు. సాధారణంగా ప్రధానమంత్రులు స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగం చేసేటప్పడు బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనకగా పోడియం ఏర్పాటుచేస్తారు. ఈసారి భద్రతాపరంగా తీవ్రమైన ముప్పు ఉందన్న హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. తాను మాత్రం ప్రజలతో నేరుగానే ప్రసంగిస్తాను తప్ప బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనక నుంచి మాట్లాడేది లేదని 2014 నుంచి చెబుతూనే వస్తున్నారు. ఈసారి కూడా అలాగే చేశారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత నుంచి ప్రధానమంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు వాడటం అలవాటుగా మారింది. 1985 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి దీన్ని ప్రారంభించారు. 1990లో వీపీ సింగ్ వచ్చిన తర్వాత సగం వరకు మాత్రమే బుల్లెట్ ప్రూఫ్ ఉంచాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక మళ్లీ దాని ఎత్తు పెంచారు. అయితే ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోదీ మాత్రం రాజస్థానీ తలపాగా ధరించి, తన ట్రేడ్‌మార్కు పొట్టి చేతుల కుర్తా ధరించి స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా బుల్లెట్ ప్రూఫ్ లేకుండానే ప్రసంగిస్తున్నారు.