బాలకృష్ణతో సినిమా.. రొమాంటిక్ సీన్లపై హీరోయిన్ విమర్శలు | Radhika Apte Reacts Balakrishna Legend Movie Scenes | Sakshi
Sakshi News home page

Radhika Apte: అప్పుడు నటించి.. ఇప్పుడు విమర్శలా?

Nov 3 2026 10:18 AM | Updated on Nov 3 2026 10:35 AM

Radhika Apte Reacts Balakrishna Legend Movie Scenes

కొందరు హిందీ హీరోయిన్లకు టాలీవుడ్, ఇక్కడి సినిమాలంటే మరీ చులకన అయిపోయింది. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసమని ఇక్కడి మూవీస్ చేశారు. ఇప్పుడు కాస్త పేరొచ్చి, అవకాశాలు వచ్చేసరికి తెలుగు చిత్రాలపై ఆడిపోసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఇదే తంతు. ప్రముఖ హీరోయిన్ రాధిక ఆప్టే.. బాలకృష్ణ సినిమాలో నటించడం, రొమాన్స్ చేయడం గురించి విమర్శలు చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: నన్ను ముందుకు నడిపిస్తోంది జ్యోతికనే)

ముంబైకి చెందిన రాధిక ఆప్టే.. కెరీర్ ప్రారంభంలో అంటే 10-12 ఏళ్ల క్రితం తెలుగులో లెజెండ్, లయన్ సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. అయితే దక్షిణాది ఇండస్ట్రీల్లో హీరోల డామినేషన్ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడే రాధిక.. తను నటించిన 'అక్క' సిరీస్ ప్రమోషన్లలో భాగంగా పరోక్షంగా 'లెజెండ్' చిత్రం అందులోని సన్నివేశాల గురించి మాట్లాడుతూ ట్రోల్ చేసింది.

'తెలుగులో నేను చేసిన ఓ సినిమాలో నాకంటే వయసులో చాలా పెద్దవాడైన నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చింది. కథలో భాగంగా సొంత మామనే పెళ్లి చేసుకునే సన్నివేశాలు ఉన్నాయి. పైగా సినిమా మధ్యలోనే నా పాత్రను చంపేశారు' అని రాధిక నవ్వుతూ ఈ విషయాల్ని చెప్పుకొచ్చింది. నేరుగా పేరు చెప్పనప్పటికీ ఇది 'లెజెండ్' అని అర్థమవుతోంది.

ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పేరు, డబ్బుల కోసం సినిమాల్లో నటించినప్పుడు ఇలాంటి విమర్శలు, ట్రోల్స్ గుర్తుకురావా అని తెలుగు నెటిజన్లు ఈమెని విమర్శిస్తున్నారు.

(ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జంట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement