తెలుగు సీరియల్స్ చేసే నటీనటులు అప్పుడప్పుడు ప్రేమించి పెళ్లిచేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలానే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో కావ్య, విక్రమ్ పాత్రలు చేసిన కల్యాణ్, ఇంచారా శెట్టి పెళ్లి చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న వీళ్లు.. పెద్దల్ని ఒప్పించి అక్టోబర్ 31న ఒక్కటయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ‘మెగా’ ఇంట్లో పెళ్లి బాజాలు.. ఈ నెల 5న ఎంగేజ్‌మెంట్!?)
ఇంచారా శెట్టి విషయానికొస్తే.. కన్నడలో చాలా సీరియల్స్ చేసిన ఈమె, ‘రాధిక’ సీరియల్‌తో పాపులర్ అయ్యింది. ఇందులో గమ్య పాత్రలో మెప్పించింది. తర్వాత ‘కెండ సంపిగే’ అనే సీరియల్‌లోనూ కీలకపాత్ర పోషించింది. తెలుగులోకి ‘ఇంటింటి గృహలక్ష్మి’తో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తులసి కూతురు దివ్యగా చేసింది. ప్రస్తుతం 'బొమ్మరిల్లు'లో ప్రధాన పాత్ర చేస్తోంది. మరోవైపు కల్యాణ్.. కుస్తీ కళ్యాణి, గుండమ్మ కథ తదితర సీరియల్స్ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడంతో తోటి నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: నన్ను ముందుకు నడిపిస్తోంది జ్యోతికనే)


