17 ఏళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. ప్రియునితో భార్యను పంపిన భర్త! | Husband, wife after 17 years end Marriage and send with man | Sakshi
Sakshi News home page

17 ఏళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. ప్రియునితో భార్యను పంపిన భర్త!

Oct 19 2026 11:06 AM | Updated on Oct 19 2026 11:11 AM

Husband, wife after 17 years end Marriage and send with man

సీతాపూర్‌: పదిహేడేళ్ల క్రితం అగ్నిసాక్షిగా ఒక్కటైన జంట.. వారికి ఎదిగిన ఇద్దరు పిల్లలు.. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న సంసారంలోకి ఫేస్‌బుక్ రూపంలో తుఫాను వచ్చిపడింది! ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన విపిన్ భార్గవ్ భార్య 22 రోజుల క్రితం హఠాత్తుగా అదృశ్యమవడంతో, ఆందోళనతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్తకు కొన్ని రోజుల తర్వాత తెలిసిన నిజం గుండెను పిండేసింది. సోషల్ మీడియాలో పరిచయమైన అంబేద్కర్‌నగర్ యువకుడు రాహుల్ ప్రేమలో పడిన ఆమె, భర్త దగ్గరకు వచ్చి నిష్కర్షగా తేల్చి చెప్పింది ‘నాకు ఈ కాపురం వద్దు.. అతనితోనే నా జీవితం’ అని! ఆ క్షణంలో ఆమె మాటలు ఆ భర్త గుండెల్లో పిడుగుల్లా పడ్డాయి.

సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో రగిలిపోయే పగలు, పోలీస్ కేసులు, రచ్చరచ్చ అయ్యే పంచాయితీలు చూస్తుంటాం. కానీ ఇక్కడ ఊహకందని హైడ్రామా చోటుచేసుకుంది! ఆగ్రహాన్ని దిగమింగి, పగను పక్కనపెట్టిన ఆ భర్త.. భార్య కోరికకు తలవంచాడు. తహసీల్ కార్యాలయంలో చట్టపరమైన కాగితాలపై సంతకాలు పూర్తయ్యాయి. ఆ వెంటనే అక్కడే ఉన్న హనుమాన్ ఆలయం సాక్షిగా, అందరిముందు భార్య మెడలో ఆ ప్రియుడు దండ వేస్తుంటే.. నిశ్చేష్టుడై నిలబడిపోయాడు విపిన్.

పదిహేడేళ్ల జ్ఞాపకాలను, 16, 14 ఏళ్ల ఇద్దరు కన్నబిడ్డల భవిష్యత్తును వెనక్కి నెట్టి.. ఆమె పరాయి వ్యక్తితో అడుగులు వేస్తుంటే, కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుని స్వయంగా కారు డోర్ తీసి మరీ ఆమెను ఢిల్లీకి సాగనంపాడు. ‘ఇకపై ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. వారిద్దరూ సుఖంగా ఉండాలి’ అంటూ ఆ భర్త నిండు హృదయంతో వీడ్కోలు పలికిన తీరు చూసి స్థానికులు విస్తుపోయారు. పగతో కాకుండా, సాదర వీడ్కోలుతో 17 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన ఈ అరుదైన ఉదంతం ఇప్పుడు  చర్చనీయాంశంగా మారింది! 

ఇదీ చదవండి: ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్‌’ లాంటి ఘటనలు: దిప్కే 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement