భార్యాభర్తల మధ్య ఒక సరదా గిఫ్ట్ కోట్లరూపాయల జాక్పాట్ను తెచ్చిపెట్టిందంటే నమ్మగలరా? అవును అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఒక దంపతులకు , స్థానిక కిరాణా దుకాణంలో చేసిన ఒక మామూలు లాటరీ టికెట్ ఆజన్మాంతం మర్చిపోలేని బహుమతిగా నిలిచింది.
అమెరికాకు చెందిన వ్యక్తి తన భార్యకు లాటరీ టిక్కెట్లను బహుమతిగా ఇచ్చాడు. అలా సరదాగా ఇచ్చిమర్చిపోయిన లాటరీ టికెట్ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 5 కోట్ల జాక్పాట్ను గెలుచుకుంది ఆ డబ్బులో కొంత భాగాన్ని ట్రావెలింగ్ కోసం ఖర్చు చేయాలని భావిస్తున్నామంటూ సంతోషంగా వెల్లడించింది.
ఇదీ చదవండి: గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
వర్జీనియాలోని బెడ్ఫోర్డ్ కౌంటీకి చెందిన ఒక వ్యక్తి స్థానిక కన్వీనియన్స్ స్టోర్లో రెండు 'గోల్డ్ 7ఎస్' స్క్రాచ్-ఆఫ్ లాటరీ టికెట్లు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చాడు. వాటిని తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు. భార్య ఆ టికెట్లను స్క్రాచ్ చేయగా, అందులో ఒక టికెట్కు టాప్ ప్రైజ్ అయిన డాలర్ల 577,777 (సుమారు రూ. 5 కోట్లు) దక్కింది. ఈ డబ్బుతో తాను ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేయాలని ఆశపడుతున్నట్లు ఆమె వర్జీనియా లాటరీ అధికారులతో పంచుకున్నారు.
ఇదీ చదవండి: 39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం


