స్కాట్లాండ్లోని గ్లాస్గో విమానాశ్రయంలో చోటు చేసుకున్న తేలికపాటి విమాన (light aircraft) ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. శుక్రవారం సాయంత్రం సుమారు 4:45 గంటలకు స్టిర్లింగ్లోని డ్రైమెన్ (Drymen) గ్రామానికి ఈశాన్య దిశలో ఈ విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 ఏళ్ల బాలుడు, 80 ఏళ్ల వృద్ధుడు మరణించారు. సమాచారం అందుకున్న అత్యవసర సేవల సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.
ప్రమాదం అనంతరం, డ్రైమెన్ గ్రామం చుట్టుపక్కల డ్రోన్లతో సహా ఇతర విమాన సేవలకు తాత్కాలికంగా వైమానిక మార్గంలో ఆంక్షలు విధించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (AAIB) తమ దర్యాప్తు కొనసాగించడానికి ఈ ఆంక్షలు కొంతకాలం అమలులో ఉంటాయని స్కాట్లాండ్ పోలీసులు తెలిపారు. అలాగే, నిరోధిత వైమానిక ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రయాణించడం లేదా డ్రోన్లు ఎగరవేయడం నేరమని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
పైపర్ టోమాహాక్ II విమానం శుక్రవారం మధ్యాహ్నం 16:17 గంటలకు గ్లాస్గో విమానాశ్రయం నుండి బయలుదేరింది. స్టిర్లింగ్లోని డ్రైమెన్కు ఈశాన్యంగా కొన్ని మైళ్ల దూరంలో, 16:37 గంటలకు అది సిగ్నల్స్ ఆగిపోయాయి. అంతకుముందు, ఈ విమానం శుక్రవారం ఉదయం 11:46 గంటలకు కంబర్నాల్డ్ విమానాశ్రయం నుండి బయలుదేరి, 15 నిమిషాల్లో గ్లాస్గో విమానాశ్రయానికి చేరుకుంది. ఆ తర్వాత ఈశాన్య దిశగా న్యూపోర్ట్ ఆన్ టేకు రెండు గంటల పాటు ప్రయాణించి, తిరిగి గ్లాస్గో వైపు బయలుదేరింది. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన అని, బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారుగ్లాస్గో విమానాశ్రయ మేనేజింగ్ డైరెక్టర్ గావిన్ బిర్చ్-విలియమ్స్.
ఇదీ చదవండి: బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత


