విమాన ప్రమాదం.. ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబం మృతి! | Florida plane crash Texas business tycoon wife and two children among victims | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదం.. ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబం మృతి!

Nov 3 2026 7:36 AM | Updated on Nov 3 2026 7:36 AM

Florida plane crash Texas business tycoon wife and two children among victims

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఆదివారం జరిగిన ప్రైవేట్ జెట్ విమాన ప్రమాదంలో టెక్సాస్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన భార్య, ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ పామ్ బీచ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో వ్యాపారవేత్త ఆడమ్ రాబిన్సన్ (45), ఆయన భార్య హెలెన్ షార్ప్ (40), వారి ఇద్దరు చిన్నారులు, కుటుంబ నానీ, మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. విమాన పైలట్ జెఫ్ గ్రెగరీ (55), కోపైలట్ నథాలియా ఫిల్గుయిరాస్ (20)గా గుర్తించారు.

టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు చెందిన రాబిన్సన్ టెక్నాలజీ సంస్థను స్థాపించగా, ఆయన భార్య కమ్యూనికేషన్ సంస్థను నిర్వహిస్తున్నారు. వీరు ఆస్టిన్ నుంచి బహామాస్‌కు లియర్‌జెట్ 60 విమానంలో బయలుదేరారు. ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణమై ఉండొచ్చని అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి (ఎన్‌టీఎస్‌బీ)ప్రాథమికంగా భావిస్తోంది. విమానం 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా తుఫాను పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో పైలట్లు మరో 2 వేల అడుగుల ఎత్తుకు వెళ్లేందుకు అనుమతి కోరారు. కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి వేగంగా కిందకు దిగినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డింగ్స్ వెల్లడించాయి.

విమానం నేలను ఢీకొనడానికి ముందే కొన్ని భాగాలు విడిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలంలో ఆధారాలను సేకరించడం సవాలుగా మారిందని తెలిపారు. వాతావరణ పరిస్థితులతో పాటు విమానంపై మంచు పేరుకుపోవడం కూడా ప్రమాదానికి కారణమైందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అమెరికాలో కాల్పుల కలకలం.. పలువురు మృతి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement