అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న వారంతా (తొమ్మిది మంది) మృతి చెందారు. క్రెస్ట్‌హేవెన్ సమీపంలో నివాస ప్రాంతంలో ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. సుమారు 8 వేల అడుగుల ఎత్తు నుంచి దక్షిణ ఫ్లోరిడాలోని ఓ నివాస ప్రాంతంలో విమానం దూసుకొచ్చింది. టెక్సాస్ నుంచి బహామాస్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి కొద్దిసేపటి ముందు విమానం కాక్‌పిట్‌లో జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగులు వెలుగులోకి వచ్చాయి. పైలట్ తొలుత విమానంపై మంచు పేరుకుపోయిందని చెప్పినట్లు వినిపించింది. అయితే, ఆ తర్వాత విమానం వేగంగా కిందికి దిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికే విమానం నేలను ఢీకొట్టబోతోందని సిబ్బంది భయంతో అరిచినట్లు ఆడియోలో వెల్లడైంది.
ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానం అత్యంత వేగంతో, తీవ్ర వాలుతో నేలను ఢీకొట్టిన వెంటనే భారీ పేలుడు సంభవించినట్లు ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. ప్రమాద స్థలంలో విమాన శకలాలు, రోడ్డుపై ధ్వంసమైన భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. వాటి చుట్టూ మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. విమాన ప్రమాదం ఇళ్లకు, కార్లకు కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే జరిగినట్లు తెలుస్తోంది. అయితే, నేలపై ఉన్నవారెవరూ ప్రాణాలు కోల్పోలేదని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ వెల్లడించారు.
ఇదీ చదవండి: వారెన్ బఫెట్ గత 48 ఏళ్లుగా నీళ్లు తాగలేదట..!


