ఇరాన్‌ నౌకను హైజాక్‌ చేసిన సోమాలియా పైరేట్స్‌  | Somali pirates have hijacked an Iranian fishing boat | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ నౌకను హైజాక్‌ చేసిన సోమాలియా పైరేట్స్‌ 

Nov 2 2026 5:52 AM | Updated on Nov 2 2026 5:52 AM

Somali pirates have hijacked an Iranian fishing boat

మొగదిషు: ఇరాన్‌ చేపల వేట నౌకను సోమాలియా సముద్రపు దొంగలు స్వా«దీనం చేసుకున్నారు. పుంట్‌ల్యాండ్‌ తీర ప్రాంతంలోని బందర్‌ బెయ్లా, హాఫున్‌ పట్టణాల మధ్య ఈ బోటు హైజాక్‌కు గురయ్యింది. నౌకలో 21 మంది ఇరాన్‌ సిబ్బంది, ఇద్దరు సోమా లియా భద్రతా సిబ్బంది ఉన్నారు. వారి భద్రతపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని మారిటైమ్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఇండియన్‌ ఓషన్‌ పేర్కొంది. 

ఆ నౌక వాణిజ్య నౌకా రవాణా మార్గాన్ని సమీపిస్తోందని, పైరేట్స్‌ ఆ నౌకను పెద్ద కార్గో నౌకలపై దాడులకు స్థావరంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ ప్రాంతంలోని నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందించాలని కోరింది. ఈ ఘటనపై యూరోపియన్‌ యూనియన్‌ నావికా దళం దర్యాప్తు చేస్తోంది. గత కొన్ని నెలలుగా గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్, పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో సోమాలియా సముద్రపు దొంగల దాడులు మళ్లీ విజృంభించాయి. జూలై నుంచి ఇరాన్‌కు చెందిన నౌక హైజాక్‌ అవ్వడం ఇది మూడోసారి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement