breaking news
hijacking
-
కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌కు ఇజ్రాయెలీ అవార్డు!
టెల్అవీవ్: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ యత్నాన్ని కో–పైలెట్ కత్తిపోట్లను సైతం ఎదుర్కొని అడ్డుకున్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌ను ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని అందించనున్నట్లు అధ్యక్షుడు ఐసాక్ హెర్జోగ్ తెలిపారు. ఈ హైజాక్ ఘటనను అడ్డుకున్న ఆరుగురు ఇజ్రాయెలీలు టాలి మానెస్, జ్వికా మానెస్, యానివ్ హయూన్, షోటా ముసాయెవ్, అసాఫ్ రాజౌన్, ఓర్ పార్డిలోవ్లకు గురువారం ఆయన ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజమ్’ను అందించారు. జెరూసలెంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెలీ హీరోలను ఈ రోజు సత్కరించుకున్నామని, భారతీయ కెప్టెన్ మచ్ఛార్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నామని తెలిపారు. మచ్ఛార్ తెగువ, స్థైర్యం, వృత్తిపరమైన నిబద్ధతల కారణంగానే ఓ విధ్వంస చర్యకు అడ్డుకట్ట పడిందని, పూర్తిగా కోలుకున్న తరువాత అతడికి ఇజ్రాయెల్ తరఫున అవార్డు అందించడం తనకు ఎంతో గర్వకారణమని ఆయన చెప్పారు. అక్టోబరు ఏడవ తేదీ నాటి హమాస్ దాడుల తరువాత అధ్యక్షుడు హర్జోగ్ ఏర్పాటు చేసిన అత్యుతన్న పౌర పురస్కారం ఇది. ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ప్రాణాలకు తెగించి అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించే వారిని గుర్తించేందుకు, గౌరవించేందుకు ఈ అవార్డు ఏర్పాటైనట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది. -
ఆ హైజాక్ ఘటన..మా అమ్మ ఫ్లైట్ జర్నీలకు బ్రేక్ వేయలేదు!
ఒక్కోసారి కొన్ని ప్రయాణాలు భయానక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎంతలా అంటే ఓ పట్టాన తేరుకోలేం. ఇంకోసారి అలాంటి జర్నీలు చేసే సాహసం కూడా చేయం. కానీ ఈ మహిళ టీనేజ్ వయసులో భయానక హైజాకింగ్ ఘటన ఎదుర్కొంది. క్షణం, క్షణం ఉత్కంఠ రేపే ఆ ఘటనలు బతికున్నంత వరకు మర్చిపోని విషాదం అది. అయినా..అది తన జర్నీలకు బ్రేక్ వేయలేదంటూ తన కథను సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. నెటిజన్లు ఆమె స్టోరీని అద్భుతమైన స్ఫూర్తిదాయక కథ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ రోహన్ శర్మ తన తల్లి అద్భుతమైన కథను ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకున్నారు. పాన్ ఆమ్ ఫ్లైట్ 73 హైజాక్ ఘటన జరిగి 40 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు. తన తల్లికి 15 ఏళ్ల వయసున్నప్పుడు సెలవుల తర్వాత ఢిల్లీ నుంచి ఒంటరిగా అమెరికాకు వెళ్తుండగా ఈ దురుదృష్టకర ఘటనను ఎదుర్కొందని తెలిపాడు. ఇన్నేళ్లయినా..ఆ భయనాక క్షణాలు తనను ఇంకా వెంటాడుతూనే ఉన్నా..విమానా ప్రయాణాలు ఆపలేదని ధీమాగా చెబుతున్నాడు. ఆ విషాద ఘటన తన అమ్మకు ప్రపంచాన్ని చూడాలనే కలను దూరం చేయలేకపోయిందని అంటున్నాడు. కరేబియన్‌లో స్కూబా డైవింగ్ చేయడం, స్విస్ ఆల్ప్స్లో స్కీయింగ్ చేయడం, పోర్చుగల్ జలాల్లో ఈత కొట్టడం వరకు ప్రతి సాహసాన్ని ఆస్వాదిస్తోంది. పైగా కోలుకోవడం అంటే మర్చిపోవడం కాదని జీవించడం అని నిరూపించిందని గర్వంగా చెబుతున్నాడు. అంతేగాదు తను ఆ గాయం తనని నిర్దేశించకూడదని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది అందువల్లే ఈ సాహసకృత్యాలను చేయగలిగింది, మంచి అనుభవాల్ని సంపాదించుకుందని చెబుతున్నాడు. ఇక ఆమె తల్లి కూడా ఆనాటి విషాద దృశ్యాలు తన మనసులో గాఢంగా ముద్రపడిపోయాయని, అవి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయన్నారామె. తనలా నాటి పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లు కోలుకున్నారా లేదా అని ఆలోచిస్తుంటానని చెబుతోందామె. అయితే తాను టీనేజ్ వయసులో ఎదుర్కొన్న ఆ గాయాన్ని తనను శాసించకూడదని అనుకున్నా కాబట్టి ఇవన్నీ చేయగలిగానని అంటోందామె. అలాగే ఆ భయానక సంఘటనను గుర్తుచేసుకుంటూ.. తనెలా బయటపడిందో పంచుకుంది. ‘పాన్ ఆమ్ ఫ్లైట్ 73 హైజాక్‌కు గురైంది. ప్రయాణికులు సుమారు 16 గంటల పాటు బందీలుగా ఉంచారు. హైజాకర్లు కాల్పులు జరపడానికి ముందు ప్రయాణికులను విమానం మధ్యలోకి తీసుకువెళ్లారని, ఇంతలో మరో ప్రయాణికురాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవడంతో దానిగుండా తాను బయటపడినట్లు తెలిపింది. అయితే లోపల కాల్పుల శబ్దానికి బిగుసుకుపోయి విమానం రెక్కపై ఉండిపోయానని, ఇంతలో సన్‌షైన్ అనే ఫ్లైట్ అటెండెంట్ విమానం రెక్కపై నుంచి నెమ్మదిగా కిందకు దించిందంటూ నాటి విషాదాన్ని కళ్లకు కట్టినట్లు వివరించింది’. అయితే తాను శారీరకంగా ఎలాంటి గాయాలవ్వకుండా సురక్షితం బయటపడ్డప్పటికీ..ఆ ఘటనలో సుమారు 21 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది. అది నిజంగా ఎవ్వరి జీవితాన్ని అయినా ప్రభావితం చేసే భయానకమైన బాధకర ఘటనగా అభివర్ణించిందామె. అయితే తాను దాన్నుంచి బయటపడి ధైర్యంగా ముందుకు సాగాలనుకున్నా..కాబట్టి విమాన ప్రయాణాలకు బ్రేక్ పడలేదని నవ్వుతూ చెబుతుంది. అంతేగాదు ఇలాంటి అనుభవం పొందిన వాళ్లు ఎవ్వరైనా తెలుసుకోవాల్సింది ఏంటో తన అనుభవంతో గొప్ప పాఠాన్ని నేర్పిందామె. నెటిజన్లు కూడా హ్యాట్సాఫ్ మేడం..అద్భుతమైన కథ అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rohan Sharma (@rohabits) (చదవండి: ఏఐ టూత్ బ్రెష్..దెబ్బకు నోటి సమస్యలకు చెక్!) -
Pak: సైన్యం విజయం ఉత్తదే
ఇస్లామాబాద్: జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన మిలిటెంట్లందరినీ మట్టుబెట్టామంటూ పాకిస్తాన్ సైన్యం చేసిన ప్రకటనను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) గురువారం ఖండించింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదని, సైన్యంపై కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. యుద్ధక్షేత్రంలో విజయం సాధించినట్లు సైన్యం చెప్పుకుంటోందని, అందులో ఎంతమాత్రం నిజంలేదని వివరించింది. తమ దాడిలో పాక్ భద్రతా బలగాలకు భారీగా నష్టం వాటిల్లినట్లు స్పష్టంచేసింది. ఇప్పటికే పాక్ సైనికులు చాలామంది మరణించారని పేర్కొంది. శత్రువుపై యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు బీఎల్ఏ ఒక ప్రకటన జారీ చేసింది. చాలామంది ప్రయాణికులు తమ అధీనంలోనే ఉన్నారని ప్రకటించింది. మంగళవారం 440 మంది ప్రయాణిలకులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. 33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని, మిగిలిన ప్రయాణికులను క్షేమంగా విడిపించామని పాక్ సైన్యం బుధవారం వెల్లడించింది. అయితే, పాక్ సైన్యం తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని బీఎల్ఏ ఆరోపించింది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని.. రైలులో ఉన్న కొందరు సైనికులను తామే వదిలేశామని వెల్లడించింది. సైన్యం తమపై పోరాటం చేయలేక సామాన్య బలూచ్ పౌరులను వేధిస్తోందని విమర్శించింది. జైళ్లలో ఉన్న తమ మిలిటెంట్లను వదిలిపెడితే రైలులో మిగిలి∙ఉన్న సైనికులు, ప్రయాణికుల విడుదల చేస్తామని బీఎల్ఏ ప్రతిపాదించింది. తమ మాట వినకపోతే జరగబోయే పరిణామాలకు పాక్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. బలూచిస్తాన్‌లో యుద్ధవాతావరణం నెలకొన్న ప్రాంతాలను సందర్శించేందుకు జర్నలిస్టులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ఇక్కడి పరిస్థితులు ఏమిటో బాహ్య ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని బీఎల్ఏ స్పష్టం చేసింది. -
ఆ బస్సు హైజాక్ కాలేదు : పోలీసులు
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ బస్సు హైజాక్ కథ సుఖాంతమైంది. బస్సును అపహరించలేదని, బస్సుపై రుణం తీసుకున్న యజమాని ఈఎంఐని సకాలంలో చెల్లించకోవడంతో బస్సును తీసుకెళ్లినట్లు ఓ ఫైనాన్స్ కంపెనీ వెల్లడించింది. ప్రయాణికులను సురక్షితంగా వారి ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. దీంతో ఆగ్రా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఆగ్రాలోని న్యూ సదరన్ బైపాస్ సమీపంలో బుధవారం వేకువజామున ఓ ప్రైవేట్ బస్సును గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బైపాస్ రోడ్ వద్ద బస్సుని ఆపిన దుండగులు మొదట బస్సు డ్రైవర్, హెల్పర్‌ను కిందకు దించేసి, ఆ తర్వాత బస్సును హైజాక్ చేసినట్లు తెలిసింది. ఆ బస్సు హర్యానాలోని గురుగ్రామ్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దుండగులు మొదటగా తాము ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులమని చెప్పి బస్సు ఎక్కారని, తర్వాత డ్రైవర్, సహాయకుడిని బెదిరించి బస్సును అపహరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అసలు విషయం బయటపడింది. బస్సుపై రుణం తీసుకున్న యజమాని ఈఎంఐలు చెల్లించకపోవడంతో బస్సును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఫైనాన్స్ కంపెనీపై కేసులు నమోదు చేసినట్టు చెప్పిన పోలీసులు బస్సును ఝాన్సీకి తరలించారు. -
ఏడాదిలో ఎన్ని వెబ్ సైట్లు హైజాక్ అయ్యాయో తెలుసా?
దాదాపు 7 లక్షల వెబ్ సైట్లు ప్రమాదకరంలో ఉన్నాయా..? అవన్నీ హైజాకింగ్ కు గురయ్యాయా అంటే ..? అవుననే అంటున్నాయి గూగుల్ రికార్డ్స్. వెబ్ సెక్యురిటీని పెంచడం కోసం జరిపిన పరిశోధనలో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. 2014 జూన్ నుంచి 2015 జూలై వరకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, గూగుల్ సంయుక్తంగా ఈ పరిశోధన జరిపింది. రొటీన్ గా వేయికి పైగా వెబ్ సర్వర్ లకు దుండగులు హాని కల్గిస్తూ.. సమాచారాన్ని దొంగలిస్తున్నారని పరిశోధన తెలిపింది. ఒక్క ఏడాదిలోనే 7 లక్షల 60వేలకు పైగా వెబ్ సైట్లు హైజాక్ కు గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. హానికరమైన యూఆర్ఎల్ లను గుర్తించినప్పుడు గూగుల్ సేఫ్ బ్రౌజింగ్ అలర్ట్ ల ద్వారా నెట్ వర్క్ నిర్వాహకులకు నోటిఫికేషన్లను అందిస్తుంది. దీంతో 50 శాతం వరకూ కేసులు నిరోధించగలిగారని గూగుల్ రిపోర్టు చెప్పింది. వెబ్ సైట్లపై జరుగుతున్న ఈ అటాక్ లో ఎక్కువగా ఇంగ్లీస్ వెబ్ సైట్లు ఉంటున్నాయని, తర్వాత స్థానాల్లో చైనీస్, జర్మన్, జపనీస్, రష్యన్ భాషా వెబ్ సైట్లు ఉన్నాయని గూగుల్ పరిశోధన చెప్పింది. -
హైజాక్ హెచ్చరిక.. విమానాశ్రయాలు అలర్ట్
న్యూఢిల్లీ: విమానాల హైజాక్‌కు కుట్ర జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు. ప్రయాణికులను, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించిన తర్వాత కూడా లగేజీని జాగ్రత్తగా పరిశీలించాలని సిబ్బందికి సూచనలు చేశారు.


