సాక్షి, ముంబై: బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న 'ఆవారాపన్ 2' మూవీతో ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తున్న నటుడు సువిందర్ విక్కీ( Suvinder Vicky). బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఆవారాపన్ 2' లో అద్భుత నటనతో గుర్తింపు పొంది, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పదండి ఆయన బాలీవుడ్ జర్నీ ఎలాసాగింది, ఇంత సక్సెస్ ఎలా వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాం.
సినీ రంగంలో రాణించాలంటే నటన మీద ఆసక్తి ఉన్నంతనే సరిపోదు. ఎన్నో కష్ట నష్టాలు, అవమానాలు భరించాల్సి ఉంటుంది. అలా ఎంతోమంది నటులు ఏళ్ల తరబడి పోరాటం తరువాత రాణించినవారే. సువిందర్ విక్కీ సక్సెస్ స్టోరీ కూడా అలాంటిదే. ఆయన వెండితెర ఎంట్రీ అంత ఆషామాషీగా జరగలేదు. ఆరంభంలో పొట్టనింపుకోవడానికి చాలా కష్టపడ్డారు.
ఇదీ చదవండి : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు బెంగాల్ కోర్టు షాక్
పంజాబ్‌కు చెందిన సువిందర్ విక్కీ సినీ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన ప్పటికీ చిన్న వయసులోనే సినిమాలపై ఆసక్తి కలిగింది.పంజాబీ విశ్వవిద్యాలయం (పాటియాలా)నుంచి థియేటర్ మరియు టెలివిజన్‌లో ఎంఏ పూర్తి చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో కేవలం రూ.5,000 చేతిలో పెట్టుకుని ముంబైకి వచ్చారు. అయితే నెల రోజుల్లోనే ఆ డబ్బులు అయిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి పంజాబ్ వెళ్లాల్సి వచ్చింది. ముంబైలో ఉన్నప్పుడు కనీసం ఒక పూట భోజనానికి కూడా డబ్బు లేని క్లిష్ట పరిస్థితులను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో, పొట్టకూటి కోసం ఆయన కొంతకాలం ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా కూడా పాలసీలు విక్రయించారు. తిరిగి చాలాకాలానికి 50 ఏళ్ల వయసులో స్టార్‌డమ్‌ను సాధించారు.
నటనలో అరంగేట్రం
పంజాబ్‌కు తిరిగి వచ్చిన తర్వాత, సువిందర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం ప్రారంభించారు. 2004లో 'దేస్ హోయా పర్దేస్' అనే పంజాబీ చిత్రంతో అరంగేట్రం చేశారు. తర్వాత 'ఉడ్తా పంజాబ్', అక్షయ్ కుమార్ నటించిన 'కేసరి' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. 50 ఏళ్ల వయస్సులో నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన 'కోహ్రా' (Kohrra) వెబ్ సిరీస్‌తో ఆయనకు నటుడిగా గుర్తింపు లభించింది. ఇందులో ఆయన నటనను సినీ ప్రముఖులు ఎంతగానో ప్రశంసించారు.
ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!
ఆ తర్వాత ఆయన రణ్‌వీర్ సింగ్ చిత్రం 'ధురంధర్: ది రివేంజ్', దిల్జీత్ దోసాంజ్ చిత్రం 'సట్లజ్', మూవీల్లో నటించారు. ముఘ్యంగా 'ధురందర్: ది రివెంజ్'లో చిన్నదైనా ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇందులో ఆయన అర్జున్ రాంపాల్ పోషించిన మేజర్ ఇక్బాల్ పాత్ర తండ్రిగా నటించారు. తెరపై తక్కువ సమయం కనిపించినప్పటికీ, ఎంతో మంది సూపర్‌స్టార్స్ కనిపించిన ఈ చిత్రంలో తనదైన ముద్ర వేయగలిగారు. ప్రస్తుతం 'అవారపన్ 2' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడం సువిందర్ విక్కీ జీవితంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం


