దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి సినిమా అంటేనే అనుకున్న టైంకి రాదులే అనుకుంటారు. దీనికి తగ్గట్లుగానే ఇతర డైరెక్టర్లు కొన్ని నెలల్లో సినిమా పూర్తి చేస్తే.. రాజమౌళి మాత్రం తన సినిమాలను ఏళ్ల తరబడి తీస్తాడన్నది అందరూ నమ్మబలికే సత్యమే. దీనికి బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలే నిదర్శనం. అయితే ఈసారి మాత్రం జక్కన్న ట్రేడ్ మార్క్‌కు భిన్నంగా వారణాసి ప్రాజెక్టను ఊహించని రీతిలో పట్టాలెక్కించాడంటే తప్పక నమ్మాల్సి వస్తోంది.
మొత్తం 1000 రోజలకు..
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తేదీని ప్రకటించారే గాని అభిమానుల్లో నమ్మకాలైతే లేవు. అయితే సినిమాపై భారీగానే అంచనాలను ఉన్నాయి. వీరి అంచనాలకు తగ్గట్లుగానే సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు ఇప్పటికే రాజమౌళి పలు దఫాలు తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ 90% పూర్తిచేసినట్లు ఇటీవలే జక్కన్న స్వయంగా వెల్లడించారు. ఇది విన్న అభిమానులు సంబరపడుతున్నారు.
ఇది ఇలా ఉంటే రాజమౌళి గత చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ మొత్తం 1000 రోజలకు పైగానే షూటింగ్ కొనసాగింది. ఈ లెక్కన చూస్తే వారణాసి షూటింగ్ మాత్రం 600ల రోజుల్లోనే పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే 2022 సెప్టెంబర్ 22 నాటికే పూర్తికానుంది. దీంతో షూటింగ్ వ్యవధి పరంగా వారణాసి కొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది.
నిర్మాణ పనులను కూడా
కాగా మిగిలిన షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్,విజువల్ ఎఫెక్ట్స్, ఇతర నిర్మాణ పనులను కూడా వేగంగా పూర్తి చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఇప్పటికే మహేష్ బాబు లుక్, రాజమౌళి టేకింగ్, భారీ నిర్మాణ విలువలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. వారణాసిలో మహేష్ బాబుకు సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇదీ చదవండి: లైంగిక కార్మికులది తప్పైతే. . అక్కడికి వెళ్లిన వారి సంగతేంటి?: సమంత


