లైంగిక కార్మికులది తప్పైతే. . అక్కడికి వెళ్లిన వారి సంగతేంటి?: సమంత | Samantha Instagram Post Viral About Womens | Sakshi
Sakshi News home page

Samantha Instagram Post: అత్యాచారం జరిగితే బాధితురాలిదే తప్పా?: సమంత

Oct 4 2026 4:39 PM | Updated on Oct 4 2026 5:07 PM

Samantha Instagram Post Viral About Womens

మా ఇంటి బంగారంతో సూపర్ హిట్‌ కొట్టిన టాలీవుడ్ బ్యూటీ సమంత. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నందిని రెడ్డి దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. తర్వాత సమంత అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానని ప్రకటించి డబుల్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ లైఫ్‌ను ఆస్వాదిస్తోంది.  అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. ఈసారి సమాజంలో మహిళలపై జరిగే అన్యాయాలపై  పోస్ట్‌ చేశారు.

అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలినే..
‘సమాజంలో లైంగిక కార్మికులను తప్పుపడతారు. కానీ వారి దగ్గరికి వెళ్లేవారిని ఏమీ అనరు. ఒంటరి తల్లులను విమర్శిస్తారు. కానీ పిల్లల బాధ్యత తీసుకోని తండ్రులను ఎవరూ అడగని కూడా అడగరు. అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలినే తప్పుపడతారు. కానీ తప్పు చేసిన వారిని ప్రశ్నించరు’ అని  అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెడుతూ అసహనం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement