ప్రెగ్నెన్సీతో సమంత.. అత్తగారింట సీమంతం వేడుక | Samantha Latest Baby Shower Pics Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Samantha: ప్రెగ్నెన్సీతో సమంత.. అత్తగారింట సీమంతం వేడుక

Nov 18 2026 11:18 AM | Updated on Nov 18 2026 11:18 AM

Samantha Latest Baby Shower Pics Goes Viral In Social Media

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఈ ఏడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ బిడ్డకు జన్మనివ్వనుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో వేడుక జరుపుకుంది. తన అత్తగారి ఫ్యామిలీతో కలిసి సీమంతం వేడుకను సెలబ్రేట్ చేసుకుంది.

కాగా.. సామ్.. బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరును పెళ్లాడింది. వీరిద్దరు కలిసి వెబ్ సిరీస్‌ల్లో పని చేశారు. ‍అదే సమయంలో ప్రేమ చిగురించింది. గతేడాది డిసెంబర్‌లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వీరి పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ ఏడాదిలోనే వీరిద్దరు తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. మరోవైపు సమంత.. మా ఇంటి బంగారం మూవీతో సూపర్ హిట్ కొట్టింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement