రవితేజ హీరోగా వచ్చిన మూవీ ఇరుముడి. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ శివనిర్వాణ దర్శకత్వం వహించారు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు.
తాజాగా ఈ మూవీ డైరెక్టర్ శివనిర్వాణ, నిర్మాత రవిశంకర్ అయ్యప్ప దీక్ష స్వీకరించారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని ప్రముఖ ఆలయంలో వీరిద్దరు దీక్షకు పూనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఏడాది ఇరుముడి సూపర్ హిట్ కావడం.. డైరెక్టర్, నిర్మాత దీక్ష తీసుకోవడం టాలీవుడ్‌లో ఆసక్తి కలిగిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ కనిపించింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.
Irumudi Director @ShivaNirvana and Mythri Producer Y. Ravi Shankar took Ayyappa Deeksha today at Film Nagar Daiva Sannidhanam. Swamiye Saranam Ayyappa! 🙏 https://t.co/wwWAPtEJgq
— Telugu Film Producers Council (@tfpcin) November 18, 2026


