'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' తదితర సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ప్రస్తుతం నటుడిగాను రాణిస్తున్నారు. తాజాగా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు తరుణ్ భాస్కర్ మదర్ గీతా భాస్కర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తరుణ్ భాస్కర్ పార్ట్‌నర్ ఎవరనే విషయంపై కామెంట్స్ చేశారు. ఆమెనే తరుణ్ సోల్‌మేట్ అంటూ అఫీషియల్‌గా ప్రకటించారు.
ఈ రెండేళ్లలో తరుణ్ భాస్కర్ ఎన్నో ఒడుదొడుకులు చూశాడని ఆమె అన్నారు. కోర్టు కేసులు, ఇల్లు కట్టడం వంటి సమస్యలు ఎన్నో వచ్చి పడ్డాయని తెలిపారు. ఇంటికి రాని రోజులు కూడా చాలా ఉన్నాయన్నారు. ఇంటికి వచ్చినప్పుడు రాత్రి పూట 2 గంటలకి, 4 గంటలకి భోజనం పెట్టడానికి ఒక మంచి సోల్ మేట్ దొరికిందని తెలిపింది. ఆమె మరెవరో కాదు.. మనందరం ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈషానే అంటూ వెల్లడించారు. ఈషానే తరుణ్‌కు ఫ్రెండ్ మాత్రమే కాదు.. మంచి సోల్‌మేట్ అని ప్రకటించింది. ఈషా వల్లనే ఈ మూవీని పూర్తి చేయగలిగాడని కూడా పేర్కొన్నారు. ఈషా రూపంలో తరుణ్‌కి మంచి తోడు దొరికిందని సంతోషం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరిపై వస్తున్న రూమర్స్‌కు ఇక తెరపడింది. త్వరలోనే ఈ జంట కూడా పెళ్లి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.


